Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDiwali: దీపావళి బాక్సాఫీస్ రేస్ లో, ఏ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది?

Diwali: దీపావళి బాక్సాఫీస్ రేస్ లో, ఏ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది?

Blockbuster: ఈ దీపావళి పండుగ సందర్భంగా థియేటర్ల దగ్గర సందడి మామూలుగా లేదు. పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా, నాలుగు సినిమాలు ఒకేసారి బరిలోకి దిగాయి. వాటిలో మిత్రమండలి, డ్యూడ్, కె-ర్యాంప్, తెలుసు కదా, అన్నింటిలోనూ యంగ్ హీరోలే. మరి ఈ నాలుగు సినిమాలలో ప్రేక్షకులు దేనికి పట్టం కట్టారు? దీపావళి బ్లాక్‌బస్టర్‌గా ఏ సినిమా నిలిచిందో చూద్దాం.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-upcoming-seven-movies-2025-to-2030/

ఆడియన్స్ మెచ్చిన దీపావళి విన్నర్ ఎవరంటే?

ఈసారి పండుగ రేసులో ప్రేక్షకులను ఆకట్టుకుని, మంచి కలెక్షన్లు సాధించిన చిత్రాలు రెండు, కిరణ్ అబ్బవరం నటించిన ‘కె-ర్యాంప్’ ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’

కె-ర్యాంప్ కిరణ్ అబ్బవరం యాక్షన్, రొమాన్స్ అంశాలతో చేసిన ఈ సినిమాకు విడుదల తర్వాత అనూహ్యంగా పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు. అంచనాలు పెద్దగా లేకపోయినా, సినిమాలోని ఎంటర్‌టైన్‌మెంట్ బాగుండడంతో, బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను తెచ్చుకుంటూ, విన్నర్‌గా కొనసాగుతుంది.

డ్యూడ్, ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ రంగనాథన్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయింది. కామెడీ, రొమాన్స్ కలగలిసిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడమే కాకుండా, పండుగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకర్షించింది. అందుకే ‘డ్యూడ్’ కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా కొనసాగుతుంది.

మిస్ ఫైర్

పోటీలో ఉన్న నాలుగు సినిమాల్లో, ప్రియదర్శి నటించిన ‘మిత్రమండలి’ ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి నెగటివ్ టాక్ రావడంతో, కలెక్షన్లు తొలి రోజు నుంచే పడిపోయాయి. కామెడీ జానర్‌లో వచ్చినా, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా దీపావళి రేస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vishal-comments-on-awards-podcast-viral/

తెలుసు కదా అంచనాలు అందుకోలేకపోయింది!
సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమాకు, సిద్ధుకు ఉన్న యూత్ ఫాలోయింగ్ వల్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, సినిమా కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, మరియు బలమైన పోటీ వల్ల ఈ సినిమా కూడా హిట్‌గా నిలవలేకపోయింది. ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ‘కె-ర్యాంప్’ మరియు ‘డ్యూడ్’ వైపు మొగ్గు చూపారు. మొత్తానికి ప్రేక్షకులు కె ర్యాంప్, డ్యూడ్ సినిమాలను దీపావళి విన్నర్స్ గా చేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad