OTT: ఈ దీపావళి పండుగ సందర్భంగా తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్ద రేసే జరిగింది. ఏకంగా నాలుగు సినిమాలు విడుదల కాగా, అందులో కొన్ని ఆడియన్స్‌ను బాగా అలరించాయి. మరికొన్ని సినిమాలు మాత్రం నిరాశపరిచాయి. ఇప్పుడు ఈ సినిమాలు అన్ని థియేటర్ రన్ పూర్తిచేసుకుని, ఓటిటిలోకి వస్తున్నాయి. మూడు సినిమాలు అయితే ఒకే రోజు, ఒకే ఓటిటి ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
దీపావళి రేసులో ఉన్నప్పటికీ, పండుగకు కొద్ది రోజులు ముందు రిలీజ్ అయిన ప్రియదర్శి నటించిన ‘మిత్ర మండలి’ సినిమా థియేటర్‌లో ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ రావడంతో, దీపావళి పోటీ వరకు కూడా థియేటర్లలో నిలబడలేకపోయింది. అందుకే, ఈ సినిమా చాలా త్వరగా ఓటిటిలోకి వచ్చింది. అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ, కేవలం మూడు వారాలకే, నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది. ఓటిటిలో ‘బ్రాండ్ న్యూ కట్’ అని రిలీజ్ చేసినప్పటికీ, దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
ALSO READ: Satya: ఆల్‌రౌండర్ సత్య కమెడియన్ టు సోలో హీరో!
దీపావళి రేసులో మిగిలిన సినిమాలతో పోలిస్తే బాగా ఆడి, విజేతగా నిలిచిన సినిమా కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా ఓటిటి హక్కులను తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ అయిన ఆహా దక్కించుకుంది. సాధారణంగా థియేట్రికల్ విండో ప్రకారం, నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటిటిలోకి వస్తుంది. అందుకే, ‘కె-ర్యాంప్’ సినిమా నవంబర్ 15, నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్లలో ఎలాగైతే పోటీ జరిగిందో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా దాదాపు ఒకే రోజు మూడు సినిమాలు పోటీ పడబోతున్నాయి. ‘తెలుసు కాద’ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో యావరేజ్‌గా నిలిచినా, ఈ మూవీ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ నవంబర్ 13, నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఆ వెంటనే, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమా కూడా మిక్స్‌డ్ టాక్‌తో పర్వాలేదనిపించింది. ఈ మూవీ కూడా నవంబర్ 14, 2025 న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ నటించిన ‘బైసన్’ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీ కూడా నవంబర్ 14 నుంచే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తోంది.
ALSO READ: SSMB 29: రాజమౌళి ప్రతీ సినిమాకి కాపీ కొట్టడమే..
దీపావళికి వచ్చిన హారర్ కామెడీ మూవీ ‘తామా’ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ మూవీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి వెళ్లాయి. ఈ సినిమా మిగతా సినిమాలతో పోలిస్తే కొంచెం ఆలస్యంగా, డిసెంబర్ లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తానికి ఈ దీవాలి సినిమాలు అన్ని ఇంకొక వారం లో ఓటిటి లోకి రాబోతున్నాయి అన్నమాట.


