97వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌కు(Oscars) అర్హత సాధించిన 323 సినిమాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. ఇందులో 207 సినిమాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ కేటగిరీలో అర్హత సాధించాయి. భారత్ నుంచి కూడా కొన్ని చిత్రాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఇందులో సూర్య నటించిన తమిళ చిత్రం ‘కంగువా'(Kanguva) ఉండటం విశేషం. భారీ అంచనాల మధ్య గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఇక ఈ జాబితాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం (గోట్ లైఫ్), స్వాతంత్ర్య వీర్ సావర్కర్(హిందీ), సంతోష్(హిందీ), ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్(మలయాళం), గర్ల్స్ విల్ బి గర్ల్స్(హిందీ-ఇంగ్లీష్), పుతుల్(బెంగాలీ) చిత్రాలు కూడా స్థానం సంపాదించాయి.
కాగా ఈ నామినేషన్లకు బుధవారం నుంచి ఓటింగ్ ప్రారంభమై.. జనవరి 12న ముగుస్తుంది. జనవరి 17న తుది నామినేషన్‌ల జాబితాలను ప్రకటిస్తారు. మరి తుది జాబితాలోకి భారత్ చిత్రాలు చోటు దక్కించుకుంటాయో లేదో చూడాలి.