Saturday, June 21, 2025
Homeచిత్ర ప్రభAishwarya Rajesh: రాజేంద్ర ప్రసాద్‌ నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అని తెలుసా?

Aishwarya Rajesh: రాజేంద్ర ప్రసాద్‌ నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అని తెలుసా?

Tollywood Heroine: సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ గురించిన చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు ప్రముఖ నటుల కుటుంబాల నుంచి వచ్చిన వారు ఎన్నో అవకాశాలను అందుకుని సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే, ఈ అవకాశం మాత్రం అందరికీ రాదు. కొంతమందికి మాత్రమే దక్కుతుంది. దాన్ని సక్సెస్‌గా మార్చుకునేది కొందరే. అలా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ కిడ్స్‌లో కొంతమంది తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని పాపులారిటీని సంపాదించారు, కానీ మరికొంతమంది ఆశించిన స్థాయిలో ఎదగలేక పోయారు.

- Advertisement -

ప్రస్తుతం ఉన్న స్టార్ కిడ్స్ చాలా మంది చిన్నప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించినవారే. కొంతమంది ఎన్నో సినిమాలు చేసి తమదైన గుర్తింపును దక్కించుకున్నారు. మరికొంతమంది కొన్ని సినిమాలల్లోనే నటించి మెప్పించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న చిన్న పాప కూడా చిన్నతనంలో సినిమాల్లో నటించింది. కానీ ఈ క్యూట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడే హీరోయిన్ గా మారి, జోరుగా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ గుర్తింపును సంపాదించుకుంది. లేటెస్ట్‌గా ఓ భారీ బ్లాక్‌బస్టర్ సినిమాతో తన నటనను ప్రూవ్ చేసి, వందల కోట్ల వసూళ్లతో ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు.. ఐశ్వర్యా రాజేష్.

Aishwarya Rajesh

రాంబంటు సినిమా లో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి కనిపించిన చిన్నారి .. ఆ ఫొటోలో కనిపిస్తున్నది, అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్. తెలుగుసినిమాలు చేయటానికి కంటే ముందే ఆమె తమిళ్ ఇండస్ట్రీలోనే డిఫరెంట్ మూవీస్ చేసి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. తన అభినయంతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల భామ, తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో అడుగుపెట్టింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/huge-varanasi-set-built-for-rajamouli-mahesh-movie-ssmb29/

ఆసక్తికరమైన విషయమేమంటే.. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా కూడా రాజేంద్ర ప్రసాద్‌తోనే కావటం విశేషం. అప్పటి నుంచి తెలుగులో సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఈ అమ్మడు మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ఆమె హీరో వెంకటేష్ భార్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News