Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPawan Kalyan: పవన్‌ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్‌కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

Pawan Kalyan: పవన్‌ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్‌కు ‘ఓజీ’ మేకర్స్ రిక్వెస్ట్

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (OG). ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ పోస్ట్‌ పెట్టింది. ‘ఆయన్ని ఇబ్బంది పెట్టకండి’ అని విన్నపం చేసింది. ఈ చిత్రంతో థియేటర్లలో అల్లాడిద్దామని తెలిపింది.

- Advertisement -

‘‘ఓజీ’పై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం. కానీ పవన్‌కల్యాణ్‌ రాజకీయ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అరవడం, ఆయన్ని ఇబ్బందిపెట్టడం సరైన పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన బాధ్యత. కాబట్టి కొన్ని రోజులు ఓపికగా ఎదురుచూద్దాం. 2025.. ఓజీ పండుగ ఘనంగా జరగనుందని మేము గట్టిగా నమ్ముతున్నాం’’ అని పేర్కొంది.

కాగా వైసీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించిన సంగతి తెలిపిందే. ఈ సందర్భంగా ఆయన సీరియస్‌గా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘ఓజీ ఓజీ’ అంటూ స్లోగన్స్‌ చేశారు. దీనిపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో తెలియదు. పక్కకు జరగండి’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad