Pawan Kalyan OG: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్ నుంచే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతాయి. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటున్న పవన్, మరోవైపు కమిటైన ఒక్కో సినిమాను పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అలా, ఆయన నటించిన గత చిత్రం హరి హర వీరమల్లు వచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చింది కానీ.. ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. పవన్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడటం అభిమానులు తట్టుకోలేకపోయారు.
ఈ క్రమంలో పవన్ నుంచి రాబోతున్న ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ ఈ నెల 25వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అవుతున్నారు. ఇటీవల ఆయన పాత్రకి సంబంధించిన వీడియోను వదిలి మేకర్స్ ఇంకా అంచనాలు పెంచారు.
Also read – Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 కోసం సరికొత్త కథ.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న కాన్సెప్ట్
ఇక తాజా సమాచారం మేరకు డిప్యూటీ సీఎం గా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారట. అంతేకాదు, మేకర్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ చేశారు. ఓజీ షూటింగ్‌కి ఇదే చివరిరోజు అని కూడా ఓ పిక్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కథా నేపథ్యం కూడా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. జపనీస్ మాఫియా నేపథ్యంలో ఓజి కథ సాగుతుందని చెప్పుకుంటున్నారు.
హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ చనిపోవడంతో ఓజాస్ గంభీర పాత్రలో పవన్ ఎంట్రీ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ గా పవన్ మాస్ ఎలివేషన్స్ పీక్స్ లో ఉంటాయట. స్వతహాగానే పవన్ కళ్యాణ్ ని గన్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ మూవీలో ఆ తరహా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయట. హంగ్రీ చీతాగా మాఫియా ముఠాని వెంటాడి వేటాడే సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని చిత్ర బృందం హింటిస్తోంది. చూడాలి మరి హరి హర వీరమల్లుతో నిరాశపరిచిన పవర్ స్టార్ ఆ లోటును ఓజీతో భర్తీ చేస్తారని అభిమానులు చెప్పుకుంటున్నారు.
Also Read – Sai Tej: నా గర్లఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్లిపోవడానికి మెయిన్ రీజన్ అదే!


