Pradeep Ranganadhan: యూత్‌ను బాగా ఆకట్టుకుని, బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు సాధించిన సూపర్ హిట్ సినిమా ‘డ్యూడ్’ . లవ్, కామెడీ, మంచి ఫీల్‌తో వచ్చిన ఈ ఎంటర్‌టైనర్, హీరో ప్రదీప్ రంగనాథన్ కి ఇది హ్యాట్రిక్ హిట్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది. నవంబర్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘డ్యూడ్’ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేని యూత్ అంతా ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Janhvi Kapoor: పల్లెటూరి గెటప్స్‌లో జాన్వీ కపూర్ లుక్స్‌పై కామెంట్లు!
ఈ మూవీ తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మలయాళం వంటి పాన్-ఇండియా భాషల్లో అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ కు జోడీగా మమితా బైజు నటించింది. ప్రేమలు టైం లోనే మమితా బైజు కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
అలాగే, శరత్ కుమార్ కూడా మమితా బైజు ఫాదర్ రోల్ లో అందరిని ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ కీర్తిశ్వరన్ కి మొదటి సినిమా. ఈ మూవీకి సాయి అభ్యంకర్ ఇచ్చిన మ్యూజిక్ చాలా పెద్ద ప్లస్ అయ్యింది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి ఓటీటీ విడుదల తేదీ గురించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: Sreeleela: ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన శ్రీలీల – ఆశలన్నీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌పైనే?
ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్, తన తర్వాత సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమా పేరు ‘LIK’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) . ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ కూడా ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఒక ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీగా ఉండబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ సాంగ్ కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో ఎస్.జె. సూర్య కూడా ఒక కీ రోల్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. ఈ ‘LIK’ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో కలిసి నిర్మిస్తున్నాయి.


