Saturday, November 15, 2025
HomeTop StoriesDude Movie: దివాళీ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?... ఎందులో చూడాలంటే?

Dude Movie: దివాళీ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?… ఎందులో చూడాలంటే?

Dude Movie: ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టించిన డ్యూడ్ మూవీ దీపావ‌ళి విన్న‌ర్‌గా నిలిచింది. రొమాంటిక్ యాక్ష‌న్ కామెడీగా రూపొందిన ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళంలో వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే 83 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. భారీ లాభాల దిశ‌గా సాగుతోంది.

- Advertisement -

డ్యూడ్ మూవీలో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌కు జోడీగా మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించింది. కీర్తిశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషించారు. కాన్సెప్ట్‌, కామెడీతో పాటు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, మ‌మితా బైజు యాక్టింగ్‌కు ఆడియెన్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. డ్యూడ్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. న‌వంబ‌ర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతోన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. న‌వంబ‌ర్ సెకండ్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌.

డ్యూడ్ మూవీతో హీరోగా తెలుగులోనూ హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌. అత‌డి గ‌త సినిమాలు ల‌వ్ టుడే, డ్రాగ‌న్ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టాయి. డ్యూడ్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. కేవ‌లం 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నిర్మాత‌ల‌కు భారీగానే లాభాల‌ను తెచ్చిపెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. థియేట‌ర్ల‌లో రిలీజై ఐదు రోజులు అవుతున్నా ఇప్ప‌టికీ హౌజ్‌ఫుల్స్‌తో న‌డుస్తోంది.

Also Read – Pragya Jaiswal: బ్లాక్ శారీలో ప్రగ్యా పరువాల జాతర

ఈ సంక్రాంతికి డ్యూడ్‌తో పాటు కిర‌ణ్ అబ్బ‌వ‌రం కే ర్యాంప్‌, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ తెలుసు క‌దాతో పాటు మిత్ర‌మండ‌లి సినిమాలు రిలీజ‌య్యాయి. కానీ డ్యూడ్‌కు తెలుగు హీరోల సినిమాలు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి.

డ్యూడ్ కాన్సెప్ట్ పాత‌దే అయినా కామెడీతో కొత్త‌గా స్క్రీప్‌పై ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు కీర్తిశ్వ‌ర‌న్‌. ఈ సినిమాకు సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. డ్యూడ్ మూవీ క‌థ‌కు తెలుగులో వ‌చ్చిన ఆర్య 2తో పాటు నువ్వే కావాలి, చిరున‌వ్వుతో వంటి సినిమాలు స్ఫూర్తి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కోమ‌లి మూవీతో డైరెక్ట‌ర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ల‌వ్ టుడేతో హీరోగా మారాడు. మ‌రోవైపు ప్రేమ‌లు మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది మ‌ల‌యాళం బ్యూటీ మ‌మితా బైజు. ప్ర‌స్తుతం సూర్య‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తుంది.

Also Read – Mahesh and Rajamouli: SSMB 29 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ లాక్ చేసిన జక్కన్న.. ఫ్యాన్స్‌కి పండగే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad