Pavala Syamala: పావలా శ్యామల.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. రంగస్థల నటిగా రంగ ప్రవేశం చేసి హాస్య నటిగా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. పలు చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవటంతో ఆమె సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటికే కొందరు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. కుమార్తె దగ్గరున్న ఆమెకు ఇప్పుడు ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆమె కుమార్తెకు కూడా ఇప్పుడు ఆరోగ్యం బాగోలేకపోవటంతో పరిస్థితులు మరింత ఇబ్బందిగా మారింది.
Also Read- Ram Gopal Varma: హిందువులపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు… పోలీస్ కేసు నమోదు
ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉన్న ఆమెకు ఆర్థిక పరిస్థితులు మరి ఇబ్బందిని కలిగించటంతో అనాథాశ్రమంలో ఉంటోంది. ఆమె గత వైభవం కనుమరుగైంది. ఆరోగ్యం క్షీణించింది. మరో వైపు ఆర్థిక సంక్షోభంలో జీవనం సాగించలేని దుస్థితిలో ఉంది. అనారోగ్యంతో అనాథాశ్రమం నుంచి ఇప్పుడు ఆస్పత్రిలో చేరి సాయం కోసం ఎదురుచూస్తోంది. ఆమె కూతురు కూడా తీవ్రమైన అనారోగ్యంతో మంచానికి అంటిపెట్టుకుని ఉండడంతో శ్యామల మనసు మరింతగా కుంగిపోయింది. “ఇప్పుడైనా దయగల హృదయం ఉన్నవారు నా కూతురికి, నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను” అని ఆస్పత్రి బెడ్‌పై నుంచి ఆమె చెప్పిన మాటలు ఎవరి హృదయాన్నైనా కరిగిస్తాయి.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి అరిగోస పడుతున్న నటీ పావలా శ్యామల
▪️ క్షీణిస్తున్న పావలా శ్యామల ఆరోగ్యం
▪️ పావలా శ్యామల కూతురికి కూడా అనారోగ్యం
▪️ సాయం కోసం ఆర్థిస్తున్న పావలా శ్యామల
▪️ అద్దె ఇంట్లో నుంచి అనాథశ్రమంలో
▪️ సీనియర్ నటీ కన్నీటి గాధ..
@pavalashyamala #Tollywood pic.twitter.com/0vJiVwVqIH— Mohan Superhit (@MohanSuperhit) October 18, 2025
మరి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్ద మనసుతో పావలా శ్యామలకు, ఆమె కుమార్తెకు ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తారేమో చూడాలి.


