Kaantha Movie Teaser: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’ (Kaantha). ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా జులై 28న ‘కాంత’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా కథాపరంగా చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా, టీజర్ చూస్తుంటే హీరోకి, దర్శకుడికి మధ్య జరిగే ఈగో క్లాష్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది.
‘కాంత’ చిత్రం 1950ల మద్రాస్ (ప్రస్తుత చెన్నై) నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఇది ఒక పీరియాడికల్ మూవీ. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శక నటుడు సముద్రఖని (Samuthirakani) ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన దర్శకుడిగానూ, రచయిత పాత్రను పోషించినట్లు సమాచారం. సెల్వమణి సెల్వరాజ్ (Selvamani selvaraj) ఈ పీరియాడిక్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్‌తో కలిసి ప్రముఖ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati), ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కాంత’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
‘కాంత’ టీజర్‌ను గమనిస్తే ‘శాంత’ అనే పేరుతో రూపొందుతున్న ఒక సినిమాకు సంబంధించి హీరో, దర్శకుడు మధ్య జరిగే అభిప్రాయ బేదాలు, ఇగో క్లాషెస్ ఈ చిత్రానికి ప్రధాన కథాంశంగా నిలవనుంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే తమ నిజ జీవిత పాత్రలైన హీరో, హీరోయిన్లుగానే కనిపిస్తున్నారని టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ ఆసక్తికరమైన కథాంశం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ‘కాంత’ చిత్రం సెప్టెంబర్ 12న (Kaantha Release Date) ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ పీరియాడికల్ డ్రామా సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా రేంజ్‌లో మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలత్తో బ్లాక్ బసర్స్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తున్నారు. కాంత సినిమాతో పాటు ఆకాశంతో ఒక తార సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్‌ను సాధిస్తాయోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


