Betting APP Case: బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ప్రకాశ్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రచారం వల్ల ఎలాంటి లబ్ది పొందలేదని ప్రకాశ్ రాజ్ స్టేట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం.
ఈడీ విచారణ ముగిసిన అనంతరం ప్రకాశ్ రాజ్
ఈడీ విచారణ ముగిసిన అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ… అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు బాధ్యత గల పౌరుడిగా సమాధానాలు చెప్పానని పేర్కొన్నారు.ఇప్పటికే తనను అధికారులు ఐదు గంటల పాటు అన్ని విషయాలపై విచారించారని.. మళ్లీ తనను విచారణకు రమ్మని చెప్పలేదని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని చెప్పారు. ఇక నుంచి బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయను అని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించాలని ఎవరూ భావించవద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని.. కష్టపడి సంపాదించడం ఎలాగో నేర్చుకోవాలని ప్రకాశ్ రాజ్ అన్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/actress-payal-rajput-father-passes-away/
రానా, విజయ్ దేవరకొండ విచారణకు ఎప్పుడంటే
కాగా, ఇవాళ (జులై 30) ఉదయం 10 గంటలకు ప్రకాశ్ రాజ్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. నిందులుగా ఉన్న పలువురినీ సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ సహా తదితరులు ఉన్నారు. వాస్తవానికి రానా జులై 23న విచారణకు హాజారు కావాల్సి ఉండగా…. విచారణకు రావడానికి కాస్త గడువు కావాలని కోరారు. ఆగస్టు 11న విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు.


