ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) నిందితుడుగా ఉన్న అశ్లీల కంటెంట్ పంపిణీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకి షాక్ తగిలింది. ఈ కేసులో ఆయన చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. పోర్న్ కంటెంట్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈడీ శుక్రవారం వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆస్తులపై రైడ్స్ నిర్వహించింది.
రాజ్ కుంద్రా (Raj Kundra) తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందికి చెందిన ప్రాంగణాలపైనా దాడి చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 15 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొబైల్ అప్లికేషన్లు, ఇతర మోడ్ల ద్వారా అశ్లీల కంటెంట్‌ను పంపిణీ చేయడంలో అనుమానితుల పాత్రపై విచారణకు సంబంధించినదని వారు చెప్పారు.