Tollywood Heroine: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ముచ్చర్ల అరుణ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ముచ్చర్ల అరుణ భర్త వ్యాపార లావాదేవీలకు సంబంధించి వారు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ముచ్చర్ల అరుణ తన భర్త మోహన్ గుప్తాతో కలిసి చెన్నైలోని కపాలీశ్వరర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు.
ఈడీ సోదాలు…
మోహన్ గుప్తా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాలు చేస్తుంటారు. ఆయన వ్యాపారంలో అక్రమ లావాదేవీలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఈ రైడ్స్‌లో మోహన్ గుప్తా బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పది మంది వరకు అధికారులు ఈ తనీఖీల్లో పాల్గొన్నట్లు సమాచారం.
Also Read – Manchu Manoj: నేపో కిడ్స్‌పై మంచు మనోజ్ కామెంట్స్ వైరల్
తెలుగు, తమిళ భాషల్లో…
1980 దశకంలో హీరోయిన్‌గా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ముచ్చర్ల అరుణ. చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజ నటులతో సినిమాలు చేసింది. సీతాకోక చిలుక మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. జస్టిస్ చౌదరి, కిరాయి కోటిగాడు, ఆలయశిఖరం, స్వాతి, చంటబ్బాయి, రారాజు, భార్గవరాముడు, శృతిలయలుతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. పెళ్లి తర్వాత ముచ్చర్ల అరుణ సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేసింది. ముచ్చర్ల అరుణ స్వస్థలం ఖమ్మంలోని కొత్తగూడెం.
Also Read – Keerthi suresh into politics: రాజకీయాల్లోకి మహానటి.. కీర్తి సురేష్ పై చక్కర్లు కొడుతోన్న వార్త..?


