Little Hearts OTT: ఈ ఏడాది టాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది లిటిల్ హార్ట్స్. ఆడియెన్స్‌ను మెప్పించడమే కాకుండా టాలీవుడ్ హీరోల మనసులను గెలుచుకుంది.
ఓటీటీలోకి..
తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీలోకిలోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 2 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ పుకార్లపై ఈటీవీ విన్ ఓటీటీ రియాక్ట్ అయ్యింది. ఫేక్ న్యూస్ అంటూ తేల్చేసింది. ఇప్పట్లో లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీలోకి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయవద్దని ఈటీవీ విన్ తెలిపింది. ఇప్పటికీ థియేటర్లలో హౌజ్‌ఫుల్స్‌తో సినిమా ఆడుతుందని అన్నది. ఈటీవీ విన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ నెలాఖరుకు ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read- Rashmika Diet Plan: సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన రష్మిక మందన్న..
రొమాంటిక్ కామెడీ మూవీ….
లిటిల్ హార్ట్స్ మూవీలో మౌళి తనూజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, జయకృష్ణ, నిఖిల్ అబ్బూరి కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతో సాయి మార్తాండ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్యహసన్ ఈ సినిమాను నిర్మించారు.
35 కోట్ల కలెక్షన్స్…
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన లిటిల్ హార్ట్స్ సంచలన విజయాన్ని సాధించింది. హీరో, డైరెక్టర్ కొత్తవాళ్లు కావడంతో తొలుత ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం రెండు కోట్ల నలభై లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 35 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ఈ ఏడాది నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఆడియెన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరోలు సైతం లిటిల్ హార్ట్స్ మూవీకి ఫిదా అవుతున్నారు. మహేష్‌బాబు, నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, సుమంత్‌తో పాటు పలువురు హీరోలు ఈ చిన్న సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యాడు.
Also Read- Chiranjeevi: చిరు, బాబీ సినిమా మొదలయ్యేది అప్పుడే – విలన్‌గా మంచు మనోజ్?
లిటిల్ హార్ట్స్ హిట్‌తో డైరెక్టర్ సాయి మార్తాండ్‌కు టాప్ బ్యానర్ల నుంచి ఆఫర్లు వచ్చాయి. తన నెక్స్ట్ మూవీని సీనియర్ హీరో జగపతిబాబు నిర్మాణంలో చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన మౌళి తనూజ్ లిటిల్ హార్ట్స్‌తో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. శివానీ నాగారం గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా చేసింది.


