F1 THE MOVIE: ‘ఎఫ్1’ సినిమా… ఒక హాలీవుడ్ సినిమా రిలీజ్ అయ్యి మన దగ్గర వంద రోజులు ఆడుతుంటే. మన తెలుగు సినిమాలు రిలీజైన వారం రోజులు కూడా ఆడటం లేదు. ఎందుకిలా?
100 DAYS: ఈ మధ్యకాలంలో థియేటర్లలో ఒక సినిమా రెండు వారాలు ఆడితేనే గొప్ప అనుకుంటున్నారు. ఓటీటీ యుగంలో జనాలను థియేటర్ వరకు రప్పించడమే పెద్ద సవాల్. ఇలాంటి టైమ్‌లో… హాలీవుడ్ నుంచి వచ్చిన ‘ఎఫ్1’ సినిమా, ఇండియా బాక్సాఫీస్ దగ్గర రేసింగ్ కారులా దూసుకుపోయింది. ఈ సినిమా జూన్ 2025 27న రిలీజై నేటికీ వంద రోజులు పూర్తిచేసుకుంటున్నఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఇది నిజంగా ఒక రికార్డు అని చెప్పాలి.
మాస్ అంటే కేవలం ఫైట్లు కాదు, థ్రిల్! ‘ఎఫ్1’ ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో మన హీరో బ్రాడ్ పిట్ ఒక రిటైర్డ్ రేసర్. ఆయన మళ్లీ ట్రాక్‌లోకి వచ్చి, ఒక యువ రేసర్‌కు మెంటార్‌గా ఉంటూ, కుప్పకూలబోతున్న టీమ్‌ని ఎలా గెలిపించాడు అనేది కథ.
ప్రేక్షకుడిని ట్రాక్‌లోకి లాక్కెళ్లింది! ఈ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణం- దీని నిర్మాణ విలువలు. ‘టాప్ గన్: మేవరిక్’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన దర్శకుడు జోసెఫ్ కోసిన్స్కీ, నిజమైన ఫార్ములా 1 రేసింగ్ ట్రాకుల్లో, అసలు రేసుల మధ్యలో షూటింగ్ చేశారు. స్క్రీన్ మీద కారు దూసుకుపోతుంటే, ఆ వైబ్రేషన్, స్పీడ్, సౌండ్ … ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టి, కార్‌లోనే ప్రయాణం చేస్తున్న అనుభూతినిచ్చింది. ఇలాంటి అనుభూతిని ఇంట్లో టీవీలో చూడలేం, కేవలం థియేటర్‌లోనే దొరుకుతుంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/vijay-rashmika-engagement-news/
ఎందుకంటే ఇక్కడ ‘క్వాలిటీ’ నే ఎప్పుడూ కింగ్!
కేవలం హీరో ఇమేజ్, హైప్ మీద ఆధారపడి తీసే సినిమాలకు లైఫ్ తక్కువ.కానీ, ‘ఎఫ్1’ లాంటి సినిమాలు నిరూపించిన విషయం ఒక్కటే: ప్రేక్షకుడు కొత్తదనాన్ని, క్వాలిటీని కోరుకుంటాడు. సినిమా అనేది కేవలం కంటితో చూసే వినోదం కాదు, థియేటర్‌లో మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలనిపించే ఒక అద్భుతమైన అనుభవం.


