Odum Kuthira Chaadum Kuthira: కొత్త లోక ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ ఓడుం కుతిర చాదుం కుతిర ఈ వారమే ఓటీటీలోకి రాబోతుంది. రొమాంటిక్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించాడు. ఈ మలయాళం మూవీ సెప్టెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
మలయాళ కమెడియన్…
ఓడుం కుతిర చాదుం కుతిర సినిమాకు కమెడియన్ అల్తాఫ్ సలీమ్ దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కామెడీ, ఎమోషన్స్‌తో పాటు నాయకానాయికలు కెమిస్ట్రీ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో ఓడుం కుతిర చాదుం కుతిర ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో పది కోట్ల లోపే కలెక్షన్స్‌ను సాధించింది. ఫహాద్ ఫాజిల్ కెరీర్‌లో అత్యధిక నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా చెత్త రికార్డును మూటగట్టుకుంది.
Also Read – Vande Bharat Express : తిరుపతికి కొత్త వందేభారత్..నాలుగు గంటల్లోనే
కథ ఏంటంటే?
అభి, నిధిలకు పెద్దలు పెళ్లిని నిశ్చయిస్తారు. ఎంగేజ్‌మెంట్ రోజు జరిగిన ఓ ప్రమాదంలో అభి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోతాడు. ప్రమాదం నుంచి కోలుకున్న అభి బెంగళూరు వెళ్లిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. అక్కడ అతడి లైఫ్‌లోకి రేవతి వస్తుంది. నిధి, రేవతిలలో అభి ఎవరిని పెళ్లిచేసుకున్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
ఒక్క రోజు గ్యాప్‌తో…
ఓడుం కుతిర చాదుం కుతిరతో పాటు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన మరో మూవీ లోక ఛాప్టర్ వన్ ఒక రోజు తేడాతో థియేటర్లలో రిలీజయ్యాయి. లోక ఛాప్టర్ వన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. రిలీజై నెల రోజులు అవుతోన్న ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
వరల్డ్ వైడ్‌గా లోక ఛాప్టర్ వన్ మూవీ 266 కోట్ల వసూళ్లను రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఇండియాలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా చరిత్రను తిరగరాసింది.
Also Read – Sriya Reddy: హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయిన ‘ఓజీ’ బ్యూటీ


