Maareesan Movie: ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన కోలీవుడ్ థ్రిల్లర్ మూవీ మారీసన్ తెలుగులోకి వస్తుంది. తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల అవుతోంది. మారీసన్ మూవీ ఆగస్ట్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల అవుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
వడివేలు కీలక పాత్ర…
మారీసన్ మూవీలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు కోలీవుడ్ సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్ర పోషించాడు. సుదీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్‌బీ చౌదరి నిర్మించాడు. జూలై నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఫహాద్ ఫాజిల్, వడివేలు యాక్టింగ్ బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో ఫహాద్ ఫాజిల్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియెన్స్‌ను మెప్పించింది. కాన్సెప్ట్ ఆర్ట్ ఫిల్మ్‌లా స్లోగా సాగడంపై విమర్శలు వచ్చాయి. మారీసన్ మూవీకి యువన్ శంకర్‌రాజా మ్యూజిక్ అందించాడు.
Also Read – Bhatti Vikramarka: నీటి వివాదం.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
రోడ్ జర్నీ థ్రిల్లర్…
రోడ్ జర్నీ థ్రిల్లర్‌గా మారీసన్ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ సుధీష్ శంకర్. దయలాన్ (ఫహాద్ ఫాజిల్) ఓ దొంగ. వేళాయుధం (వడివేలు) పిళ్లై అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుంటాడు. తన స్నేహితుడిని కలవడానికి తిరువన్నమలై బయలుదేరుతాడు. వేళాయుధం అకౌంట్‌లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని దయలాన్ కనిపెడతాడు. ఆ డబ్బును దోచుకోవాలని ప్లాన్ వేస్తాడు. తిరువన్నమలై తీసుకెళ్లానని చెప్పి తన బైక్‌పై వేళయుధానికి లిఫ్ట్ ఇస్తాడు దయలాన్. ఈ రోడ్ జర్నీలో ఏం జరిగింది? వేళాయుధం దగ్గర నుంచి డబ్బును దయలాన్ దోచుకున్నాడా? ఈ ఇద్దరిలో అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుంది ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
పుష్ప 2లో విలన్‌గా…
గత ఏడాది రిలీజైన అల్లు అర్జున్ పుష్ప 2లో భన్వర్‌సింగ్ షెకావత్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అదరగొట్టాడు ఫహాద్ ఫాజిల్. పుష్ప 2 బ్లాక్‌బస్టర్‌తో తెలుగులో ఫహాద్ ఫాజిల్‌కు అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌తో పాటు ఆక్సిజన్ సినిమాలు చేస్తున్నాడు.


