Fahadh Faasil: సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు, వైవిధ్యతకు మారుపేరుగా నిలుస్తున్నాడు ఫహాద్ ఫాజిల్. మలయాళంలో టాప్ స్టార్స్‌లో ఒకరిగా కొనసాగుతున్న ఫహాద్ ఫాజిల్ హీరో పాత్రలకే పరిమితం కాకుండా విలన్‌గాను అదరగొడుతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాల్లో భన్వర్ సింగ్ షెకావత్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ మాత్రమే కాకుండా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఫహాద్ ఫాజిల్ నిర్మించిన ప్రేమలు సినిమా వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
కీ ప్యాడ్ ఫోన్…
ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఫహాద్ ఫాజిల్ ఫోన్ మాట్లాడుతూ కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఫహాద్ ఫాజిల్ చిన్న కీప్యాడ్ ఫోన్ వాడటం నెటిజన్లను ఆకట్టుకుంది. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్న ఈ ఫోన్ ధర వింటే మాత్రం షాకవ్వాల్సిందే.
Also Read- Devayani Sharma: అందాలతో గత్తరలేపుతున్న సైతాన్ బ్యూటీ.. మరి ఈ రేంజ్ లోనా..!
పది లక్షలు…
ఫహాద్ ఫాజిల్ వాడుతున్న ఫోన్ వెర్టూ కంపెనీది. ఈ కీప్యాడ్ ఫోన్ ధర ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఉంటుంది. చాలా తక్కువ మంది సెలబ్రిటీలు వెర్టు కంపెనీ ఫోన్ వాడుతారు. ఇందులో సెక్యూరిటీ ఎక్కువే. ఇదొక హ్యాండీ క్రాఫ్టెడ్ ఫోన్. మామూలు ప్లాస్టిక్‌తో కాకుండా ఈ ఫోన్ తయారీలో క్రిస్టల్, గోల్డ్‌తో పాటు టైటానియం వంటి ఖరీదైన ఆర్నమెంట్స్ వాడుతారు. వీటితో పాటు ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ లెథర్‌ను కూడా ఉపయోగిస్తారట. అందుకే ఈ ఫోన్ ధర పది లక్షల వరకు ఉంటుందని నెటిజన్లు చెబుతోన్నారు.
స్మార్ట్‌ఫోన్‌కు దూరం…
ఫహాద్ ఫాజిల్ స్మార్ట్ ఫోన్ అస్సలు వాడరట. సోషల్ మీడియాకు అతడు దూరమేనని మలయాళ నటుడు వినయ్ ఫోర్ట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫహాద్ ఫాజిల్‌కు అకౌంట్స్ లేవని, అతడి పేరుతో ఉన్న అకౌంట్స్‌ను కూడా ఫ్యాన్స్ రన్ చేస్తున్నట్లు వినయ్ ఫోర్ట్ సీక్రెట్ బయటపెట్టాడు.
Also Read- Hyper Aadi : హైపర్ ఆదితో అనసూయ గొడవ – ఇలాంటి మాటలకే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయానంటూ రచ్చ
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్…
పుష్ప 2 తర్వాత తెలుగులో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు ఫహాద్ ఫాజిల్. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియాతో కలిసి ఈ మూవీని రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సిద్ధార్థ్, శశాంక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఇదే బ్యానర్‌లో ఆక్సిజన్ పేరుతో మరో సినిమాకు ఫహాద్ ఫాజిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మారేశన్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మలయాళంలో నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.


