Family Man 3: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ వన్‌తో పాటు సీజన్ 2 పెద్ద సక్సెస్‌గా నిలిచాయి. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌లుగా నిలిచాయి. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌కు సీజన్ 3 రాబోతుంది. సీజన్ 3 ట్రైలర్‌ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ట్రైలర్‌లోని విజువల్స్ సినిమాలకు ధీటుగా గూస్‌బంప్స్‌ను కలిగిస్తున్నాయి. శ్రీకాంత్ తివారీగా మరోసారి మూడో సీజన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ కనిపించబోతున్నాడు.
నేను ఓ ఏజెంట్ అని శ్రీకాంత్ తివారీ అనగానే… ట్రావెల్ ఏజెంటా అతడి కొడుకు బదులిచ్చే సీన్‌తో ట్రైలర్ ఫన్నీగా మొదలైంది.
శ్రీకాంత్ తివారీపైనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావడం, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారినట్లు చూపించారు. శ్రీకాంత్ కుటుంబంతో సహ పారిపోవడానికి ప్రయత్నించడం ట్రైలర్‌లో ఆసక్తిని పంచుతోంది. ఈ క్రైమ్‌లో అతడిని ఇరికించే క్యారెక్టర్‌గా నిమ్రత్ కౌర్‌ను చూపించారు. డ్రగ్ స్మగ్లర్‌తో శ్రీకాంత్ తివారీ పోరాటం, తనపై పడిన నేరం నుంచి ఎలా బయటపడ్డాడనే అంశాలతో మూడో సీజన్ తెరకెక్కబోతున్నట్లు కనిపిస్తోంది.
Also Read – Katrina Kaif: తల్లయిన కత్రినాకైఫ్ – గుడ్ న్యూస్ షేర్ చేసిన విక్కీ కౌశల్
ఫ్యామిలీ మ్యాన్ 3లో మనోజ్ బాయ్‌పాయ్‌తో పాటు ప్రియమణి, జై దీప్ అహ్లవత్, నిమ్రత్ కౌర్, అష్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత మెయిన్ విలన్‌గా నటించింది. సమంత మాత్రం ట్రైలర్‌లో కనిపించలేదు.
డైరెక్ట్‌గా సిరీస్‌లోనే సమంత క్యారెక్టర్‌ను చూపించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ మూడేళ్ల పాటు సాగింది. 2022లో షూటింగ్‌ను మొదలుపెట్టారు. 2025లో రిలీజ్ చేస్తున్నారు.
Also Read – SSMB29: పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌తో హైప్ డబుల్ చేసిన రాజమౌళి!


