Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభJJ Abrams : RRRకి ఫిదా అంటూ రాజమౌళితో ఫోటో దిగిన హాలీవుడ్ స్టార్ డైరెక్టర్.....

JJ Abrams : RRRకి ఫిదా అంటూ రాజమౌళితో ఫోటో దిగిన హాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఎవరో తెలుసా?

- Advertisement -

JJ Abrams : RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులార్ అయ్యారు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాతో ఎలాగైనా ఆస్కార్ కొట్టాలని కంకణం కట్టుకొని గత కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంటూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొంటున్నారు. RRR సినిమాని ప్రత్యేక ప్రదర్శనలు వేయిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అందరూ రాజమౌళిని, RRR సినిమాని తెగ పొగిడేస్తున్నారు.

తాజాగా మరో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ RRR సినిమాకి, రాజమౌళికి అభిమానిని అంటున్నారు. రాజమౌళి అమెరికాలో అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఇచ్చే అవార్డుల కార్యక్రమంలో పాల్గొనగా ఈ కార్యక్రమానికి అనేక మంది హాలీవుడ్ దిగ్గజాలు వచ్చారు. మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో బాగా పాపులర్ అయిన దర్శకుడు, స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్ లాంటి సినిమాలతో హాలీవుడ్ తో పాటు ఇండియాలో కూడా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ JJ అబ్రమ్స్ ఈ కార్యక్రమంలో రాజమౌళిని కలిశారు.

JJ అబ్రమ్స్ రాజమౌళితో ఫోటో దిగి, RRR సినిమాని ప్రశంసించి, ఆ సినిమా తన ఫేవరేట్ సినిమా అయిపోయినదని తెలిపాడు. రాజమౌళి పనితనాన్ని మెచ్చుకున్నాడు. ఈమేరకు రాజమౌళి, JJ అబ్రమ్స్ దిగిన ఫోటోని RRR సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలిపారు చిత్ర యూనిట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News