Anil Ravipudi: 2020 లో వచ్చిన కరోనా వేవ్స్ తర్వాత సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ వరకూ రావాలంటే చాలా కష్టమవుతోంది. దాదాపుగా సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయినట్టే అని చెప్పక తప్పదు. ఎంత పెద్ద సినిమా అయినా మల్టీప్లెక్స్‌లో హిట్ టాక్ వస్తేనే ఓ వారం ఆడుతుంది. లేదంటే సాయంత్రానికి మర్చిపోవాల్సి వస్తోంది. ఈ కారణం వల్లే ఓటీటీలకి డిమాండ్ పెరిగింది. థియేటర్స్ కి వెళ్ళకుండానే ఇంట్లో కూర్చొని సినిమా చూసేస్తున్నారు. దాంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉండగానే ఓటీటీలు పోటీ పడుతున్నాయి.
అయితే, ఒక హీరో సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే ఎంత పెద్ద సినిమా అయినా ఓటీటీ డీల్ క్లోజ్ చేయడం కత్తి మీద సాముగా మారింది. ఇంతకముందు ట్రైలర్ చూసి సినిమా కొంటే ఇప్పుడు సినిమా చూస్తే గానీ ఓటీటీ సంస్థ కొనే పరిస్థితి లేదు. రిలీజ్‌కు ముందు వరకూ సినిమా పై క్రియేట్ అయ్యే బజ్ ని బట్టే… ఓటీటీ బేరాలు జరుగుతున్నాయి. ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా మాత్రం ఇట్టే ఓటీటీ ఢీల్ క్లోజ్ అని తెలుస్తోంది.
Also Read – RK Sagar: ప్రభాస్ సినిమాలో నటించి తప్పు చేశా – మొగలి రేకులు సాగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తై మూడవ షెడ్యూల్ జరుగుతోంది. 2026 సంక్రాంతికి రఫ్ఫాడించడానికి చిరు, అనిల్ కాంబో మూవీ వస్తోంది. అనిల్ దూకుడు చూస్తుంటే ఈ ఏడాదే రిలీజ్ చేసేలా ఉన్నాడని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ఏంటంటే మెగా 157 ఓటీటీ ఢీల్ దాదాపు క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది. అమేజాన్ ప్రైం రూ.55 కోట్ల వరకూ ఆఫర్ ఇచ్చిందట.
మేకర్స్ మాత్రం రూ.60 కోట్ల కి ఫైనల్ అని చెప్పినట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టీజర్ కూడా రిలీజ్ కాకుండా ఓటీటీ ఢీల్ క్లోజ్ అవడం అంటే మెగాస్టార్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. అదే రోజు టైటిల్ కూడా రివీల్ చేస్తారని సమాచారం. వెంకటేష్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికోసం ఆయన 20 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
Also Read – Tuna Fish Benefits: ట్యూనా చేపలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?


