Teja Sajja: కొన్ని సినిమాలకి ఎలాంటి అంచనాలు ఉండవు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ ని సాధిస్తుంటాయి. అందుకు ఉదాహరణ బలగం, హనుమాన్ (Hanu man) వంటి సినిమాలే. కొన్ని సినిమాలు ముందు నుంచి భారీ హైప్ క్రియేట్ అయి బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక ఫ్లాప్ మూవీస్ గా నిలుస్తున్నాయి. కుబేర, హరి హర వీరమల్లు లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా హనుమాన్. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకుడు.
పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం ఈ కుర్రాడు నటిస్తున్న మరో సెన్షేషనల్ మూవీ మిరాయ్ (Mirai Movie). రితికా నాయక్ హీరోయిన్ గా, మంచు మనోజ్ (Manchu Manoj) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో తేజ ఓ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
Also Read – Priyanka Jawalkar: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రియాంక.. మరి ఇంత దారుణం గానా..!
మిరాయ్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ తో బాగానే ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. వాస్తవానికి ఈ ఏడాదు ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, వీఎఎక్స్ అలాగే, కొంత షూటింగ్ మిగిలి ఉండటం వల్ల సెప్టెంబర్ 5కి రిలీజ్ విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి హిందీలోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. నార్త్ లో రిలీజ్ చేసేందుకు రైట్స్ కోసం బాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన కరణ్ జోహార్ రంగంలోకి దిగారు. మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన బాహుబలి, ఆ తర్వాత వచ్చిన దేవర లాంటి సినిమాలతో మంచి లాభాలను చూసిన కరణ్ జోహార్.. ఇప్పుడు మిరాయ్ కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో భారీ డీల్ చేసుకున్నాడు.
ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దీనిలో భాగంగా మిరాయ్ నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ సింగిల్ గా ‘వైబ్ ఉంది బేబీ’ అనే పాట విడుదలైంది. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్ పాడారు. యూత్‌ఫుల్, ఎనర్జిటిక్ గా సాగిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతోంది.
Also Read – Indian Railways: సింహస్థ కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు..!


