Saturday, November 23, 2024
Homeచిత్ర ప్రభFashion Runway: తాప్సీ వావ్

Fashion Runway: తాప్సీ వావ్

డస్కీ బ్యూటీ తాప్సీ పన్ను ఎంత పెద్ద బ్యూటీనో మీకంతా తెలుసుకదా.  బ్యూటీ విత్ బ్రెయిన్ గా ఇండస్ట్రీలో పేరుగాంచిన అతి కొద్దిమందిలో ఈమె కూడా ఒకరు.  ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేసి వదిలే తాప్సీ, ఫ్యాషన్ షోల్లో బాగానే మెరుస్తారనే ఇమేజ్ ఉంది.  నిజానికి తాప్సీ లేటెస్ట్ పిక్ చూస్తే మీరు షాక్ తినక తప్పదు.  నిజంగా బుట్టబొమ్మలా ఆమె భలే సరికొత్తగా కనిపించి వావ్ అనిపించుకున్నారు.  చంకీ గోల్డ్ జువెలరీలో ఆమె మెరిసిపోయారు.

- Advertisement -

మీరు దాన్ని టెంపుల్ జువెల్రీ అనండి లేక హెవీ జువెల్రీ అనండి, క్లాసిక్ కలెక్షన్ అనండి.. ఏమన్నా అది మాత్రం హెవీ గోల్డ్ జువెల్రీ.   ఈ భారీ నెక్ పీస్ ను వెస్ట్రన్ గౌన్ లో వేసుకున్న తాప్సీ ఈ కాంబో చాలా క్రేజీగా ఉంది అనిపించారు. చీరలు, లెహెంగాలు వంటి ఎత్నిక్ వేర్ మీద మాత్రమే కాదు హెవీ జువెల్రీ ఇలాంటి వాటితో చాలాబాగా కనిపిస్తుందనే విషయాన్ని తాప్సీ ప్రూవ్ చేస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు.

డిజైనర్ మోనిషా జైసింగ్ కలెక్షన్ డిస్ప్లే కోసం ఈమధ్యనే జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో షో స్టాపర్ గా వచ్చిన తాప్సీ ఇలా రిలయన్స్ జువెలరీని ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News