Film Chamber: చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ తరలి వచ్చినప్పుడు చాలా ఒడిదొడుకులనే ఎదుర్కొంది. దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు ఇలా అందరూ మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమను అభివృద్ధి చేయటంలో తమ వంతు పాత్రను సమర్ధవంతగా నిర్వహించారు. ఈ ప్రయాణంలో ఎంటైర్ సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్‌లో కేరాఫ్‌గా మారిన ప్లేస్ ఏదేని ఉందంటే.. అది ఫిల్మ్ చాంబర్ మాత్రమే. అయితే ఎప్పుడూ లేనిది.. ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ భవనాన్ని కూల్చేయబోతున్నారంటూ వస్తోన్న న్యూస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ తెలుగు నిర్మాతల మండలి కూడా ఉంది. దీనికి సంబంధించిన బిల్డింగ్‌లో చక్కని వసతులున్నాయి. క్లబ్ ఉంది. ఏకరం పైగా ఉన్న ఈ ప్రాంతంలోని ఈ భవనాలను కూల్చి బిల్డింగ్స్ కట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడు స్థలం దొరకటమే గగనంగా మారింది. అలాంటి ప్రాంతంలోని ఈ భవనాలను ఎందుకు కూల్చబోతున్నారనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. చాలా రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read – Ram Charan – Nelson: నెల్సన్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్! అనిరుధ్ మ్యూజిక్ పక్కా!
ఫిల్మ్ చాంబర్ ప్రస్తుత పాలక మండలిలోని కొంత మంది సభ్యులు, ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీలోని కొంత మంది సపోర్ట్‌తో ఈ చర్యలకు పాల్పడబోతున్నారని సమాచారం. అందుకనే ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. కావాలనే వాయిదా వేస్తున్నారట. ఒకవేళ ఎన్నికలు జరిగితే వచ్చే కొత్త కార్యవర్గం తమ పనులకు అడ్డం పడుతుందనేది వారి భయం. అప్పట్లోనే మన దర్శక నిర్మాతలు కోటిన్నరకు పైగానే ఖర్చు చేసి ఈ భవంతులను నిర్మించుకున్నారు.
నిజానికి ఈ ప్రాంతాన్ని లీజుకు ఇచ్చారు. ఈ లీజు 2030తో ముగియనుంది. ఫిల్మ్ ఛాంబర్ ఇక్కడకు వచ్చినప్పుడు ఏమీ లేకుండా ఉండింది. అందరూ కలిసి ఈ ప్రాంతాభివృద్ధిలో తమ వంతు చేయూతనిచ్చారు. అయితే ఇప్పుడు హౌసింగ్ సోసైటీ ఈ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనాలు కట్టాలనుకుంటోంది. కొందరు సభ్యులు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. మరీ సమస్యపై సినీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
Also Read – Vidyabalan: జైలర్2లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ – రజనీ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ


