Film Federation key comments on Shootings Bandh: ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, మెగాస్టార్ చిరంజీవి ఫెడరేషన్‌తో టచ్ లో ఉన్నారని తెలిపారు. పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధించి .. ఛాంబర్ తో మాట్లాడాలని తమకు చిరంజీవి సూచించినట్లు వెల్లడించారు.
కోర్టులోనే తేల్చుకుంటాం..
అలాగే, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే న్యాయపరంగా పరిష్కారం కోరుతామని తెలిపారు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్. పీపుల్స్ మీడియా సంస్థ కార్మికులకు చెల్లించాల్సిన రూ.90 లక్షల బకాయిలు, తక్షణమే
చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ బకాయిలు పూర్తిగా చెల్లించేవరకు టీజీ విశ్వప్రసాద్ ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగులు నిలిపివేస్తామని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అనిల్ తెలిపారు. మంత్రి ఇప్పటికే కార్మికులకు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయనను స్వయంగా కలిసి, తమ సమస్యలను వివరిస్తామని చెప్పారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/director-srinu-vaitla-about-balakrishna-movie/
ఈరోజు ఫలించకపోతే పూర్తిగా బంద్..
కాగా, శనివారం జరిగిన ఫెడరేషన్ – నిర్మాతల మధ్య చర్చలు సఫలీకృతం కాకపోవడంతో, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఫెడరేషన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా నగరంలోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనలో పాల్గొన్న 24 యూనియన్ల కార్మికులు వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మిక సంఘాల నేతలు మీడియాతో మరింత మాట్లాడుతూ.. “ఈరోజు చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివే స్తాం. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే ఒకట్రెండు రోజులు సమయం ఇస్తాం. షెడ్యూల్ ఉన్న వారితోనూ మాట్లాడి ఆ చిత్రీకరణలు కూడా నిలిపివేస్తాం.” అని చెప్పుకొచ్చారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/mahesh-babu-net-worth-income-assets-2025/


