Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభCrossover movies: మల్టీ స్టారర్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టే కొత్త మంత్రం

Crossover movies: మల్టీ స్టారర్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టే కొత్త మంత్రం

హిట్ కొట్టాలి, బాక్సాఫీస్ లో కనక వర్షం కురవాలి..ఇందుకు బెస్ట్ వే స్పై థ్రిల్లర్ వల్డ్.. డిఫరెంట్ యూనివర్స్..ఇదే ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ వుడ్ దైనా టార్గెట్ ఒకటే. ఆడియన్స్ కు నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే టికెట్లు కొంటారు లేదంటే అంతే సంగతులు. ఎట్టకేలకు ఈ విషయాన్ని జీర్ణం చేసుకున్న యంగ్ డైరెక్టర్స్, డైలాగ్-స్టోరీ రైటర్స్ ఇందుకు తగ్గట్టుగా కథలు, డైలాగులు రాసేందుకు సై అంటున్నారు.

- Advertisement -

సూపర్ స్టార్ కమల్ హాసన్ వంటి వాళ్లకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విక్రం సినిమాలోనూ సేమ్ ఈక్వేషన్. మల్టీ స్టారర్, హై యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్, అమేజింగ్ గ్రాఫిక్స్-యానిమేషన్ వర్క్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్..ఇలాంటివన్నీ ఉంటేనే థియేటర్లో బిగ్ స్క్రీన్ పైన సినిమా చూసేందుకు జనం ఎగబడతారు. 10 రోజులు కూడా తిరక్కుండానే 300 క్రోర్స్ క్లబ్ దాటేయచ్చు..అలాగే ఓటీటీ రైట్స్, అదర్ లాంగ్వేజెస్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇలా చాలానే ఉంటాయి అదనంగా లాభపడేందుకు .

పఠాన్ సినిమా హిట్ కావటంతో ఇక సూపర్ స్టార్స్ అంటే మల్టీ స్టారర్స్ జమానా మళ్లీ బాలీవుడ్ లో పట్టాలు ఎక్కుతోంది. ఇప్పటికే పఠాన్ మేకర్స్ సీక్వెల్, సల్మాన్-షారూఖ్ జుగల్ బందీ ఉంటుందని స్పష్టంచేశారు.

అంతేకాదు హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటివారందిని కలిపి కలగూర గంప సినిమా స్టోరీతో మరో బ్లాక్ బస్టర్స్ ను ఆడియన్స్ కు తప్పకుండా అందిస్తా అంటూ పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ చెప్పేశారు.

క్రాస్ ఓవర్ జమానా కాబట్టి ఇవే ఆడియన్స్ కు నచ్చుతాయి కాబట్టి పఠాన్, టైగర్ సిరీస్ సినిమాలు, వార్ వంటి సినిమాలు కలిపి కొత్త స్టోరీ లైన్ తో మళ్లీ సరికొత్త సినిమా తయారు చేసేస్తామంటూ ఈ సినిమాలకు రైటర్ గా పనిచేసిన శ్రీధర్ రాఘవన్ వెల్లడించి ఇక బాలీవుడ్ కు హిట్సే హిట్స్ అంటూ లీకు ఇచ్చారు. పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ తో మురిపించారు. టైగర్ 3 సినిమాలో షారూఖ్ కామియో రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఛాంపియన్స్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్న అమీర్ ఖాన్ కూడా సల్మాన్ తో కలిసి ఇలాంటి మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు.

సో కొంతకాలంపాటు ఈ మల్టీ స్టారర్స్ జమానా మనల్ని అలరిస్తుందన్నమాట. విశేషం ఏంటంటే హిట్లు లేక కెరీర్ లో తీవ్ర ఒత్తిడి తట్టుకోలేక పోతున్న సల్మాన్, షారూఖ్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ తమ ఈగోలను పక్కనపెట్టి మరీ ఈ మల్టీ స్టారర్స్ కు సై చెబుతున్నారు. నిజానికి సల్మాన్ కు షారూఖ్ కు చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడూ ఉంటూ వస్తోంది. అలాగే జాన్ అబ్రహంతో షారూఖ్ కు విభేదాలున్నాయి. వీటన్నింటినీ పక్కనపెట్టి షారూఖ్ వీరిద్దరితో స్క్రీన్ షేర్ చేసుకుని పెద్ద హిట్టే తన ఖాతాలో వేసుకుని, షారూఖ్ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటున్నారు. దీంతో ఇదే మంత్రాను రిపీట్ చేసే పనిలో మిగతా హీరోలంతా ఉన్నారన్నమాట. సౌత్ లోనూ ఇదే ట్రెండ్ ఇప్పటికే మొదలైంది. ఆర్ఆర్ఆర్, విక్రం, వాల్తేర్ వీరయ్య వంటి మల్టీ స్టారర్స్ మంచి కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. దీంతో మిగతా హీరోలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News