Mana Shankaravaraprasadgaru: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు. విజయదశమి పండుగ సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. త్వరలో షూటింగ్ ని కంప్లీట్ చేసి వరుస అప్‌డేట్స్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార (nayanthara) మెగాస్టార్ కి జంటగా నటిస్తున్నారు. వెంకటేశ్ (Venkatesh) గెస్ట్ రోల్ లో సందడి చేయబోతున్నారు.
మన శంకరవరప్రసాద్‌గారు మూవీలో చిరు, వెంకీలపై వచ్చే సీన్స్ ఫుల్ ఫన్ తో ఉంటాయట. అనిల్ రావిపూడి స్టైల్ కామెడీకి చిరు-వెంకీ కామెడీ టైమింగ్ కలిస్తే ఆ సీన్స్ అన్నీ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. అంతేకాదు, ఇలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు థియేటర్స్‌లో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. కేవలం సీన్స్ మాత్రమే కాదు, ఈ ఇద్దరు హీరోలపై ఓ సాంగ్ కూడా ఉండబోతుందట. ఇవన్నీ వింటుంటే తెలుగులో రాబోతోతున్న ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ మన శంకరవరప్రసాద్‌గారు అనుకోవచ్చు.
Also Read – Idli Kottu: ఇదేంటి ధనుష్ ఇలాగైంది.. ‘ఇడ్లీ కొట్టు’ ఎవడూ పట్టించుకోవటం లేదా!
ఇక ఈ సినిమాపై ముందు నుంచే అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పండుగ సందర్భంగా చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ కోసం మళ్ళీ ఉదిత్ నారాయణ్ దిగాడు. ఆయన గతంలో చిరు కోసం పాడిన పాటలన్నీ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి సాంగ్ ఈ సినిమాలో కూడా ప్లాన్ చేశారు అనిల్ రావిపూడి. మీసాల పిల్లా అంటూ ఉదిత్ (udit narayan) పాడిన పాట ప్రోమోను తాజాగా మేకర్స్ వదిలారు.
ఈ సాంగ్ వదిలే ముందు మ్యూజిక్ డైరెక్టర్ భీంస్, దర్శకుడు అనిల్ రావిపూడి ఇచ్చిన బిల్డప్ బాగా వర్కౌట్ అయింది. చిరు, నయన్ ల మీద పిక్చరైజ్ చేసిన మీసాల పిల్ల సాంగ్ గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ అంటున్నారు మెగా అభిమానులు. అంతగా ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా అనిల్ చెప్పినట్టే వింటేజ్ చిరంజీవి కనిపిస్తున్నారు. సాంగ్ కి తగ్గట్టుగా చిరు స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. పాట ప్రారంభంలో వచ్చే డైలాగ్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మొత్తానికి అనిల్ రావిపూడి చిరుకోసం ఉదిత్ నారాయణ్ ని దింపడం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.
Also Read – Samantha: సమంత కొత్త ఇల్లు ఫోటోలు చూశారా?


