Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన బ్రేక్ పై మొదటిసారి ఓపెన్ అయింది. అంతేకాదు, పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది వరకే రష్మిక ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతే సినిమాలలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలతో వరుసగా హిట్స్ అందుకుంది.
పాన్ ఇండియా హీరోయిన్:
పుష్ప ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిన రష్మిక, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అనిమల్, సికందర్, ఛావా లాంటి సినిమాలతో అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం, తన చేతిలో థామ, ది గర్ల్ ఫ్రెండ్, మైసా, రెయిన్‌బో.. లాంటి సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఇటు సౌత్ అటు నార్త్ లో రష్మిక మందన్న నంబర్ 1 స్థానంలో ఉందనే చెప్పాలి.
Also Read- Samantha: రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి సెలబ్రేషన్స్ – ఫొటోలు వైరల్
ఇటీవలే విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం:
రీసెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకి ఎంగేజ్‌మెంట్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి ఉండబోతుంది. ఈ లోపు రష్మిక నటిస్తున్న సినిమాల షూటింగ్ ని పూర్తిచేయనుంది. మరో వైపు విజయ్ కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన మొదటి బ్రేకప్ పై రియాక్ట్ అయింది.
రిలేషన్స్ బ్రేకప్ అయినప్పుడు అబ్బాయిలకంటే ఎక్కువ బాధ అమ్మాయిలకే ఉంటుంది. మేము మగవారిలాగా మీసాలు, గడ్డాలు పెంచలేము. ఎంత బాధనైనా మనసులోనే మోస్తాము. రక్షిత్ శెట్టి నుంచి బ్రేకప్ అయ్యాక నరకం అనుభవించాను అని తెలిపింది. రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, మరోసారి, విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.


