Wednesday, February 5, 2025
HomeఆటNTR: నాటు నాటు స్టెప్పుతో పుట్‌బాల్ దిగ్గజాలు.. ఎన్టీఆర్ రియాక్షన్ వైరల్

NTR: నాటు నాటు స్టెప్పుతో పుట్‌బాల్ దిగ్గజాలు.. ఎన్టీఆర్ రియాక్షన్ వైరల్

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో జక్కన్న టేకింగ్, ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) యాక్టింగ్-డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు తారక్-చెర్రీ డ్యాన్స్ అయితే అదిరిపోయింది. ఈ పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కింది. అప్పటి నుంచి ఈ పాటకు అభిమానులు సోషల్ మీడియాలో రీల్స్‌ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.

- Advertisement -

తాజాగా ఫుట్‌బాల్ దిగ్గజాలు నెయ్‌మార్, టెవెజ్, రొనాల్డో పుట్టినరోజు సందర్భంగా ఈ పాటలోని స్టెప్పుల ఫొటోను ఫెడరేషన్ ఆఫ్ ఫుల్‌బాల్ అసోసియేషన్(FIFA) తన అధికారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో వారు ముగ్గరు నాటు నాటు స్టెప్పు వేస్తున్నట్లు కనిపించారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ పోస్టర్‌ జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వార్-2, దేవర-2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News