Thursday, June 12, 2025
Homeచిత్ర ప్రభSinger Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత

Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత

Singer Mangli: ప్రముఖ సింగర్ మంగ్లీ(Mangli) వివాదంలో చిక్కుకుంది. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి మంగ్లీ కుటుంబసభ్యులు, సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన వారు హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా వినియోగించడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు త్రిపుర రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి సీజ్ చేశారు. పార్టీకి హాజరైన వారికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు రిసార్ట్ నిర్వాహకులతో పాటు, మంగ్లీ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్.. తదితరులు ఉన్నట్లు గుర్తించారు.

తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో తనకంటూ సింగర్ మంగ్లీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఆమెకు దక్కింది. ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ కావడంతో స్టార్ సింగర్ గా ఫేమ్ సంపాందించారు. న్యూస్ యాంకరింగ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా బోనాలు, శివరాత్రి పాటలు ద్వారా పేరు దక్కించుకుంది. ఈ సమయంలో ఇలాంటి బర్త్ వేడుకల ద్వారా చిక్కుల్లో పడింది. పద్థతిగా కనిపించే మంగ్లీ గంజాయి పార్టీ నిర్వహించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఇటీవల కూడా ఆమె రాజకీయ వివాదాల్లో చిక్కుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా పాటలు పాడారు. అలాగే ఆ పార్టీని గెలిపించాలని ప్రచారం చేశారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి శ్రీకాకుళంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. దీంతో ఆమెపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ట్రోలింగ్ చేశారు. వైసీపీకి మద్దతు ఇచ్చిన మంగ్లీని టీడీపీ నేతలు ఎలా కలుస్తారంటూ విమర్శించారు. ఇదే కాకుండా గతంలో శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఆమె ఆల్బమ్ షూట్ చేయడంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News