Tuesday, September 17, 2024
Homeచిత్ర ప్రభRaveena Tandon : బాలీవుడ్ భామకి నోటీసులిచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్స్.. ఆమెకి సపోర్ట్ గా నెటిజన్లు..

Raveena Tandon : బాలీవుడ్ భామకి నోటీసులిచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్స్.. ఆమెకి సపోర్ట్ గా నెటిజన్లు..

- Advertisement -

Raveena Tandon : ఇటీవల చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫి పేరుతో అడవులకి వెళ్లి పక్షులని, జంతువులని వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఇదే బాటలో వెళ్తున్నారు. తాజాగా బాలీవుడ్ భామ రవీనా టాండన్ కెమెరా పట్టుకొని అడవుల్లోకి వెళ్లి పులి వీడియోల్ని తీసి పోస్ట్ చేసినందుకు ఫారెస్ట్ అధికారులు ఆమెకి నోటీసులిచ్చారు.

ఇటీవల బాలీవుడ్ భామ రవీనా టాండన్ మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వులో టూర్ కి వెళ్లారు. అక్కడ జీపులో ప్రయాణిస్తూ పులులని వీడియోలు, ఫోటోలు తీశారు. ఈ క్రమంలో వాళ్ళు పులికి మరింత దగ్గరికి వెళ్లి వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇవి చూసిన ఫారెస్ట్ అధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు పంపించారు. ఆమెతో పాటు ఆ జీప్ నదిపైన వ్యక్తికి, అక్కడి లోకల్ ఫారెస్ట్ అధికారులకి కూడా నోటీసులు పంపించారు.

అయితే ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షర్ చేసి.. భారతదేశం వైల్డ్ లైఫ్ టూరిజం గురించి ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేస్తే తప్పంటూ నోటీసులు పంపించారు. అభినందించాల్సింది పోయి ఇలా అంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేసింది రవీనా టాండన్. దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె చేసింది కరక్టే అని, మన వైల్డ్ లైఫ్ టూరిజమ్ ప్రమోట్ చేస్తే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News