Dhanush Mrunal Thakur Dating: సెలబ్రిటీ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.. నిత్యం ఏవో కొత్త కొత్త రిలేషన్ షిప్‌లు కనిపిస్తుంటాయి. అంతే వేగంగా బ్రేకప్ వార్తలు వినిపిస్తాయి. ఈ మధ్యకాలంలో నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య కు విడాకులిచ్చిన తర్వాత, ఆయన అందాల నటి మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో ఉన్నాడంటూ పలు రకాల కథనాలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ధనుష్, మృణాల్ ఠాకూర్ పలు సందర్భాల్లో పలుమార్లు కలుసుకోవడమే కాకుండా ఒకరితో ఒకరు పబ్లిక్‌లో ఎంతో రొమాంటిక్‌గా, సన్నిహితంగా కనిపించడంతో చాలా సందేహాలు పుట్టుకొచ్చాయి. ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా.. వార్తలు వైరల్ అయిపోయాయి.
ధనుష్ (Dhanush), మృణాల్ ఠాకూర్ మధ్ ఏదో ఉందని, త్వరలోనే పెల్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే దీనిపై మృణాల్ క్లారిటీ ఇచ్చింది. ఈ పుకార్లు విన్న ప్రతిసారీ మృణాల్ సింపుల్‌గా నవ్వుకునేదానిని అని చెప్పింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని మృణాల్ ధృవీకరించింది. తమపై వస్తున్న గాసిప్పులకు చాలా నవ్వుకున్నానని, చాలా రోజులుగా తమ ఇద్దరి గురించి వార్తలు వస్తున్నాయని, అది తనకు ఫన్నీగా అనిపించిందని మృణాల్ వ్యాఖ్యానించింది. అంతేకాదు సర్దార్ 2 (Sardar 2) స్క్రీనింగ్‌కు ధనుష్ రావడానికి తను ఆహ్వానించడమే కారణమనే గుసగుసలు ఉన్నాయి. దీనిపై కూడా మృణాల్ వివరణ ఇచ్చింది. ధనుష్‌ను అజయ్ దేవగణ్ ఆహ్వానించాడని మృణాల్ క్లారిటీనిచ్చింది.
స్క్రీనింగ్ షోకు ధనుష్ రావటం అక్కడి వారితో మాట్లాడటం తప్పేమీ కాదు. అయితే సర్దార్ 2 స్క్రీనింగ్‌లో ధనుష్ ఆమె చేయి పట్టుకుని కనిపించడం ప్రజల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు ధనుష్ కొత్త సినిమా తేరే ఇష్క్ మే పార్టీకి మృణాల్ హాజరవ్వడం మరో ట్విస్ట్‌గా నిలిచింది. సంబంధం లేని పార్టీల్లో కొత్త అతిథి కనిపిస్తే ఎలా సందేహాలొస్తాయో ఆ ఇద్దరినీ కలిపిన పార్టీలు అలాంటి డౌట్లు పుట్టించాయని అందరూ అనుకుంటున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/coolie-vs-war-2-usa-box-office-pre-sales-battle/
ధనుష్ తనకు స్నేహితుడు అని మృణాల్ (Mrunal Thakur) స్వయంగా అంగీకరించినప్పటికీ ఇటీవల మృణాల్, ధనుష్ సోదరీమణులను సోషల్ మీడియాలో ఫాలో చేయడం నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. ఇదే అందరిలో ఉన్న అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. మొదట సాధారణ స్నేహం, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో స్నేహం.. ఆ తర్వాత ఇంకేదైనా జరగొచ్చు! అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మృణాల్ ఇప్పటికీ ఈ వార్తలను కొట్టిపారేస్తుంది. ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


