Funky: తాజాగా ఫంకీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. ఇది విశ్వక్ సేన్ నటిస్తున్న ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విశ్వక్ ఓ డిఫరెంట్ మ్యానరిజంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ యంగ్ హీరో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే మాట, నమ్మకం ప్రేక్షకుల్లో కలిగిందంటే దీనికి కారణం విశ్వక్ ఎంచుకుంటున్న కథలే.
ఈ మధ్య విశ్వక్ సేన్ నుంచి మెకానిక్ రాకీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లైలా సినిమాలొచ్చాయి. వాటిలో లైలా బాగా డిసప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా సాలీడ్ హిట్ కొట్టాలని ఫంకీ సినిమాతో వస్తున్నాడు. ఇది సినిమా నేపథ్యంలో తెరకెక్కుతోంది. కయాదు లోహర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. కెవి అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల వచ్చిన ఫంకీ టీజర్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది.
Also Read – Suman Shetty: వామ్మో.. సుమన్ అన్నతో మామూలుగా లేదుగా..!
టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో సాగింది. ఇందులో విశ్వక్ సేన్ దర్శకుడిగా నటిస్తున్నాడు. కయాదు లోహర్ గ్లామర్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అవుతుందనిపిస్తోంది. అలాగే, కేవీ అనుదీప్ రాసుకున్న సిట్యువేషనల్ కామెడీ సినిమా సక్సెస్ కి ప్రధాన బలం అని కూడా అర్థమవుతోంది. అయితే, ఈ సినిమాను డిసెంబర్ లోపు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని అందరూ భావించారు. కానీ, నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ 2025 ని వదిలేద్దాం అనుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ ఏడాది సితార బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేదనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా వచ్చిన మాస్ జాతర మూవీ రవితేజ కెరీర్ లో మరో ఫ్లాప్ సినిమాగా మిగిలింది. ఈ మధ్య నాగవంశీకి ఆశించిన సక్సెస్‌లు దక్కడం లేదు. దాంతో, నాగవంశీకి 2025 కలిసి రాని సంవత్సరంగా మిగిలిందనే చెప్పాలి. అందుకేనేమో ఫంకీ సినిమాను 2026 కి షిఫ్ట్ చేశాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ పోస్టర్ ని వదిలారు. దీనిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీని లాక్ చేసినట్టుగా ప్రకటించారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.
Also Read – Kanchana 4: షూటింగ్ కంప్లీట్ కాలేదు.. అయినా 100 కోట్ల బిజినెస్


