Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభFUNKY TEASER: విశ్వక్ సేన్‌, అనుదీప్ ఫంకీ టీజర్.. మళ్లీ అదే కొట్టుడు!

FUNKY TEASER: విశ్వక్ సేన్‌, అనుదీప్ ఫంకీ టీజర్.. మళ్లీ అదే కొట్టుడు!

‘ఫంకీ’ టీజర్ రివ్యూ

- Advertisement -

FUNKY: విశ్వక్ సేన్ ఈ మధ్య కాస్త ఫ్లాపులతో ఉన్నా, తన ‘మాస్ కా దాస్’ ఇమేజ్ తగ్గకుండా అనుదీప్ కేవీ విచిత్రమైన కామెడీ ట్రాక్‌లోకి ఎక్కి, ఈ ‘ఫంకీ’ టీజర్‌లో ఫుల్ జోష్ చూపించేశాడు.

అనుదీప్ మార్క్ కామెడీ, డైలాగ్స్: ఈ సినిమాను సినీ పరిశ్రమపై ఒక Satire లాగా తీస్తున్నారని తెలుస్తోంది. టీజర్‌లో విశ్వక్ సేన్ వేసే పంచ్‌లు, వెరైటీ మ్యానరిజమ్స్, ఇంకా అనుదీప్ మార్క్ “లాజిక్ లేని ఫన్” డోస్ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది కచ్చితంగా ‘జాతి రత్నాలు’ ఫ్యాన్స్‌కి పండగే!

ALSO READ: https://teluguprabha.net/cinema-news/deepika-padukone-breaks-silence-on-kalki-2-and-spirit-controversies/

‘ప్రిన్స్’ వైబ్:

అనుదీప్ ‘ప్రిన్స్’ సినిమాలో లాగే ఇందులో కూడా Vishwak Sen కామెడీతో కూడిన లవ్ ట్రాక్‌ను పట్టుకున్నట్టు కనిపిస్తోంది. హీరోయిన్ కయాదు లోహర్‌ కూడా చాలా క్యూట్‌గా, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా ఉంది. లవ్, ఫ్యామిలీ డ్రామా, అల్లరి ఈ మూడు ఎలిమెంట్స్ ‘ప్రిన్స్’ స్టైల్లో మిక్స్ అయ్యాయి. కాకపోతే, ఈసారి అనుదీప్ పాత తప్పులు దిద్దుకుని, ఫుల్లుగా నవ్వించే పక్కా ఎంటర్‌టైనర్‌ని ఇచ్చే ఛాన్స్ ఉంది.

Vishwak Sen ఈసారి కామెడీకి స్కోప్ ఉన్న పాత్రలో చాలా ఎనర్జీగా కనిపిస్తున్నాడు. తన కామెడీ టైమింగ్, అనుదీప్ కామెడీ ట్రాక్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయినట్టు ఉంది. Bheems Ceciroleo మ్యూజిక్ చాలా ‘ఫంకీ’గా, యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంది. టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. Sithara Entertainments బ్యానర్ కాబట్టి నిర్మాణ విలువలు రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-raja-saab-and-fauji-movies-expected-to-be-released-in-2026/

మొత్తం మీద మ్యాటర్ ఏంటి అంటే:

ఈ సినిమా Fun, Family, Love అండ్ Satire తో నిండిన పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ అని టీజర్ చెప్పకనే చెప్పింది. విశ్వక్ సేన్‌కి ఇది గట్టి కంబ్యాక్ ఇచ్చే సినిమా అవుతుందని ఫ్యాన్స్ చాలా గట్టిగా నమ్ముతున్నారు

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad