అడివి శేష్ అంటేనే మనోళ్లకు ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అందునా సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సీక్వెల్ అంటే ఇంకా ఎక్కువ ఆసక్తి ఉండటం క్వైట్ నాచురల్. ఇప్పుడు ఆ జీ-2 ఏకంగా ప్యాన్ ఇండియా లెవెల్లో రెడీ అవుతోంది. స్పై థ్రిల్లర్ జోనర్ ఎప్పుడూ మంచి డిమాండ్ ఉన్న థీమే. పైగా శేష్ లాంటి వాళ్లు వీటిని హ్యాండిల్ చేసే విధానం అద్భుతమనే బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న నేపథ్యంలో ప్యాన్ ఇండియా స్పై థ్రిల్లర్ G2 పైనే ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ ఫోకస్ పెడుతున్నాయి.
భారీ బడ్జెట్ కూడా
హై-ఆక్టేన్ స్పై థ్రిల్లర్ G2 హై-బడ్జెట్ చిత్రంగా షూటింగ్ చేసుకుంటోంది. ఈ యాక్షన్ ఫ్రాంచైజీలో ఇమ్రాన్ హష్మీతో పాటు వామికా గబ్బి కూడా అడివి శేష్ తో పాటు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. అంటే బాలీవుడ్ మార్కెట్ పై శేష్ మంచి ఎక్సర్ సైజ్ చేస్తున్నాడన్నమాట. జి 2 తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళం పాన్-ఇండియన్ విడుదల కానుంది.
బాలీవుడ్ ను దున్నేసేందుకు శేష్ రెడీ
బాలీవుడ్ పై మొదటి నుంచీ అడివి శేష్ కు చాలా ఎక్కువ ఆసక్తి ఉంది. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ బాక్సాఫీస్ ను దున్నేందుకు సరిపడా మసాలా మాల్ తో శేష్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ను రెడీ చేసుకుని అప్పుడే మంచి బజ్ ను సొంతం చేసుకుంటుండటం హైలైట్. మొత్తానికి టాలీవుడ్ నుంచి మరో హీరో, మరో మూవీ బాలీవుడ్ పై దండెత్తేందుకు కొత్త సంవత్సరంలో రెడీ అయిందన్నమాట.