Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభGaddam Suresh: 'దసరా' గడ్డం సురేష్ కు ఘన సన్మానం

Gaddam Suresh: ‘దసరా’ గడ్డం సురేష్ కు ఘన సన్మానం

కోల్ బెల్టు ప్రాంత యాస, బాషను ప్రపంచానికి పరిచయం చేసింది ఈయనే

ప్రముఖు నటుడు, పాటల రచయిత, దసరా సినిమా నటుడు గడ్డం సురేష్ కోల్ బెల్టు ప్రాంత యాస, బాషను ప్రపంచానికి పరిచయం చేశారని మంచిర్యాల జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు, ఆడిటింగ్ సీనియర్ అధికారి దాసరి వెంకటరమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని దాసరి వెంకటరమణ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యాధితులుగా హాజరైన గడ్డం సురేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వెంకటరమణ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతం నుంచి, ఉన్నతంగా రాణించి, తమా ప్రాంత విలువలను ప్రపంచానికి తెలియజేశారని ఆడిట్ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. మునుముందు మరింతగా రాణించి, ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి పుష్పలత, శ్రీకృతి, ఆద్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad