Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభGaddar Awards: ఉత్తమ చిత్రంగా 'కల్కి'.. ఉత్తమ దర్శకుడు ఎవరంటే.?

Gaddar Awards: ఉత్తమ చిత్రంగా ‘కల్కి’.. ఉత్తమ దర్శకుడు ఎవరంటే.?

తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను(Gaddar Awards) ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. జూన్‌ 14న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

- Advertisement -

ఉత్తమ చిత్రంగా ‘కల్కి 2898ఏడీ'(Kalki 28292AD) నిలిచింది. ఉత్తమ రెండో చిత్రంగా అనన్య నాగళ్ల నటించిన ‘పొట్టేల్’, ఉత్తమ మూడో చిత్రంగా దుల్కార్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రాలు ఎంపికయ్యాయి. ఉత్తమ బాలల చిత్రంగా ’35 ఇది చిన్న కథ కాదు’ మూవీ ఎంపికైంది. ఇక ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్(Nag Ashwin) నిలిచారు. కల్కి 2898ఏడీ చిత్రానికి గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad