Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభGaddar Awards: ఉత్తమ నటిగా నివేథా థమస్

Gaddar Awards: ఉత్తమ నటిగా నివేథా థమస్

తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను(Gaddar Awards) ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. జూన్‌ 14న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

- Advertisement -

ఉత్తమ నటిగా నివేథా థమస్(Nivetha Thamas) ఎంపికయ్యారు. ’35 ఇది చిన్న కథ కాదు’ మూవీలోని నటనకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. సంప్రదాయక చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడే గృహిణి పాత్రలో నివేథా నటన ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు నంద కిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకులు అభిమానం దక్కించుకుంది. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్‌ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad