Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభGaddar film awards: గద్దర్ అవార్డులు.. 2014- 2023 ఉత్తమ చిత్రాలివే

Gaddar film awards: గద్దర్ అవార్డులు.. 2014- 2023 ఉత్తమ చిత్రాలివే

తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను(Gaddar film awards) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 2014 నుంచి 2023 సంవత్సరాల్లో విడుదలైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ప్రముఖ సినీనటుడు మురళీమోహన్‌, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజుతో కలిసి ఈ అవార్డును వెల్లడించారు. 2014 జూన్‌ 2 నుంచి సెన్సార్‌ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి ఏడాది మూడు సినిమాలకు అవార్డులను ప్రకటించారు. స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రజాకవి కాళోజీకి అందించారు.

- Advertisement -

2014

ప్రథమ ఉత్తమ చిత్రం: రన్‌ రాజా రన్‌
రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల
మూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను

2015

ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
రెండో ఉత్తమ చిత్రం: కంచె
మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు

2016

ప్రథమ ఉత్తమ చిత్రం: శతమానం భవతి
రెండో ఉత్తమ చిత్రం: పెళ్ళి చూపులు
మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్‌

2017

ప్రథమ ఉత్తమ చిత్రం: బాహుబలి 2
రెండో ఉత్తమ చిత్రం: ఫిదా
మూడో ఉత్తమ చిత్రం: ఘాజీ

2018

ప్రథమ ఉత్తమ చిత్రం: మహానటి
రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం
మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్‌ కంచరపాలెం

2019

ప్రథమ ఉత్తమ చిత్రం: మహర్షి
రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ
మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం

2020

ప్రథమ ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురంలో..
రెండో ఉత్తమ చిత్రం: కలర్‌ ఫొటో
మూడో ఉత్తమ చిత్రం: మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌

2021

ప్రథమ ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్‌
రెండో ఉత్తమ చిత్రం: అఖండ
మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన

2022

ప్రథమ ఉత్తమ చిత్రం: సీతారామం
రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
మూడో ఉత్తమ చిత్రం: మేజర్‌

2023

ప్రథమ ఉత్తమ చిత్రం: బలగం
రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్‌
మూడో ఉత్తమ చిత్రం: భగవంత్‌ కేసరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad