గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దిగ్గజ దర్శకుడు శంకర్ గత సినిమాల్లో లాగా ఈ సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉంది. ఈ చిత్ర రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలు ఉంది. ఇందుకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్‌ను కాసేపట్లో విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఓ మల్టిప్లెక్స్ థియేటర్‌లో సింపుల్‌గా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరుకానున్నారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 4వ తేదీన రాజమండ్రిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రానున్నారు.
కాగా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే.సూర్య, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడులైన పాటలు, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే విజయవాడలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(256 అడుగులు) రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరించిన విషయం విధితమే.