గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహుర్తం ఖరారైంది. చిత్ర నిర్మాత దిల్ రాజు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను రాజమండ్రిలో నిర్వహించాలని అనుకుంటున్నామని.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని పవన్‌ను ఆయన ఆహ్వానించారు. జనవరి 4వ తేదీన రాజమండ్రిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా వచ్చేందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.
కాగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే.సూర్య, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడులైన పాటలు, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆదివారం విజయవాడలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(256 అడుగులు) రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరించిన విషయం విధితమే.