గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్(‘Game Changer) మూవీ యూనిట్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం జనవరి 9వ తేదీ అర్థరాత్రి 1 గంటలకు స్పెషల్ బెనిఫిట్ షో వేసుకునే అవకాశం కల్పించారు. ఈ షోకు జీఎస్టీతో కలిపి రూ.600లకు టికెట్ రేటు ఫిక్స్ చేశారు.
ఇక సినిమా రిలీజ్ అయ్యే 10వ తేదీన 6 షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఆరోజు ఉదయం 4 గంటల ఆట నుంచి షో వేసుకునేందుకు అంగీకారం తెలిపారు. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజుకు ఐదు షోస్ వేసుకునే అవకాశం కల్పించారు. ఈ రెండు వారాలు మల్లీప్లెక్స్‌లకు జీఎస్టీతో కలిపి రూ.175.. సింగిల్ స్క్రీన్ ధియేటర్లకు రూ.135 పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు. అయితే తెలంగాణ విషయానికి వస్తే టికెట్ రేట్లు పెంపు.. బెనిఫిట్ షోలపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.