Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభGame Changer Trailer: అదిరిపోయిన ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్

Game Changer Trailer: అదిరిపోయిన ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer Trailer) మూవీ ట్రైలర్ విడుదలైంది. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ రాజమౌళి (Rajamouli) ట్రైలర్‌ విడుదల చేశారు. నందన్‌, అప్పన్న పాత్రల్లో చరణ్‌ నటన, డైలాగ్స్‌, అంజలి యాక్టింగ్‌ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. ‘కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు… ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు’ వంటి డైలాగ్స్ మెప్పిస్తున్నాయి.

- Advertisement -

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దిగ్గజ దర్శకుడు శంకర్ గత సినిమాల్లో లాగా ఈ సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉంది. ఈ చిత్ర ర‌న్‌టైమ్ 2 గంట‌ల 45 నిమిషాలు ఉంది.

కాగా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌, ఎస్‌జే.సూర్య, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడులైన పాటలు, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే విజయవాడలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(256 అడుగులు) రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరించిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad