Saturday, November 23, 2024
Homeచిత్ర ప్రభGeetanjali: సీతగా మెప్పించి, వ్యాంప్ గా అలరించిన గీతాంజలి

Geetanjali: సీతగా మెప్పించి, వ్యాంప్ గా అలరించిన గీతాంజలి

గీతాంజలి చాలా వెరైటీ రోల్స్ ప్లేకు పేట్టింది పేరు. ఆమధ్య వచ్చిన దటీజ్ మహాలక్ష్మి అనే సినిమాలో కూడా గీతాంజలి కనిపించారు. గుండెపోటుతో కన్నుమూశారు గీతాంజలి పేరు పాతతరం నటుల్లో తప్పకుండా ఉంటుంది. 60ల్లో చాలా బిజీ యాక్ట్రెస్ గా గీతాంజలి స్టార్ డం ఎంజాయ్ చేశారు. అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఆమె తెరపై కనిపించారు. ఆమె బాలీవుడ్ లోనూ యాక్ట్ చేశారు. అంటే ఆమె పాన్ ఇండియా స్టార్ అన్నమాటేగా.

- Advertisement -

డ్యాన్స్ నేర్చుకుంది

కాకినాడలో పుట్టిన గీతాంజలి స్థానిక సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ లో చదువుకున్నారు. 3 ఏళ్ల వయసు నుంచే తన అక్కతోపాటు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునేవారు. నాలుగేళ్లు తిరక్కముందే ఆమె ఆరంగేట్రం కూడా అయి స్టేజ్ పై డ్యాన్స్ షోలు చేసేంత పట్టు సంపాదించారు గీతాంజలి.

ఇక సినిమాపరంగా చూస్తే తెలుగు, కన్నడలో ఎక్కువ సినిమాలు చేశారు. మళయాళంలో 3 సినిమాల్లో ఆమె మెరిసిపోయారు. డజనుకు పైగా హిందీ సినిమాల్లో గీతాంజలి యాక్ట్ చేశారు. ఇక గీతాంజలి అసలు పేరువిషయానికి వస్తే ఆమె ఒరిజినల్ నేమ్ మణి కానీ స్క్రీన్ నేమ్ మాత్రం గీతాంజలి. గీతాంజలిగానే ఆమె పాపులర్ అయ్యారు. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ఈమె పేరును గీతాంజలిగా మార్చారు. తమ సినిమా పేరు పారస్ మణిలో మణి ఉందని హీరోయిన్ పేరులో మణి ఎందుకని స్క్రీన్ నేమ్ గా గీతాంజలి అని పెట్టారు. ఈపేరు ఈమెకు బాగా కలిసివచ్చింది.

రామకృష్ణతో వివాహం

తన కో యాక్టర్ రామకృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. ఆతరువాత సినిమాల్లో పెద్దగా ఆమె యాక్ట్ చేయలేదు. గీతాంజలి-రామకృష్ణ వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. వీరిద్దరు కూడా హిట్ పెయిర్ అనే చెప్పుకోవాలి. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా గీతాంజలి రామకృష్ణ అనే పేరు అలా పాపులర్ అయిపోయింది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లేకానీ లవ్ మ్యారేజ్ కాదు. మంచిరోజు, పెళ్లి రోజు, తోటలో పిల్ల కోటలో రాణి, రాజయోగం, రణభేరి వంటి సినిమాల్లో వీళ్లు కలిసి యాక్ట్ చేశారు. అయితే ఇలా సినిమా షూటింగ్స్ లో రామకృష్ణ-గీతాంజలి నాన్నలు కలిసి బాగా మాట్లాడుకునేవారట. అలా వీళ్లిద్దరూ వియ్యంకులు కావాలనుకోవడంతో గీతాంజలి-రామకృష్ణల మ్యారేజ్ జరిగింది.

బిజీ యాక్ట్రెస్

ఓవైపు తెలుగులో బిజీగా ఉంటూనే మరోవైపు ఇతర భాషల్లోనూ కాల్షీట్స్ తో ఆమె బిజీగా ఉండేవారు. ఇక హిందీలోనూ దో కలియా, పేయింగ్ గెస్ట్ వంటి సినిమాల్లో తళుక్కుమన్నారు ఆమె. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజెండరీ యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆమె. 1961లో ఫస్ట్ టైం సీతారామ కల్యాణం అనే సినిమాతోఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో సీతగా ఆమెకు చాలామంచి పాపులారిటీ వచ్చింది. అంతే సీత క్యారెక్టర్ ఇచ్చిన బ్రేక్ తో ఆమె బిజీ ఫిలిం లైఫ్ ను స్టార్ట్ చేశారు. సీతగా ఆమె తెరంగేట్రం చేసేసరికి ఆమె వయసు జస్ట్ 14 ఏళ్లు మాత్రమే.

రోల్ ఏదైనా ఓకే చెప్పేవారు

ఎలాంటి రోల్ ఇచ్చినా ఆ రోల్ డ్యూరేషన్ తో, స్క్రీన్ టైంతో పనిలేకుండా గీతాంజలి తన టాలెంట్ ప్రదర్శించేవారు. అందుకే ఆమె చిన్న రోల్ ప్లే చేసినా, లీడ్ రోల్ ప్లే చేసినా అవన్నీ అంతబాగా క్లిక్ అయ్యాయి. ప్రజలకు గుర్తుండిపోయాయి. ఇలాంటి నటులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారన్నది నిజం. 20 ఏళ్ల తరువాత బిగ్ స్క్రీన్ పై సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా గీతాంజలికి మంచి రోల్స్ వచ్చాయనే చెప్పాలి. ఇంత బిగ్ గ్యాప్ తరువాత కూడా ఆమెను ప్రజలు భలే రిసీవ్ చేసుకున్నారు. గ్రీకు వీరుడు, పెళ్లైన కొత్తలో వంటి సినిమాల్లో ఆమె చాలా ఈజ్ తో యాక్ట్ చేసి కొత్త తరం వారిని కూడా అట్రాక్ట్ చేశారు.

400కు పైగా సినిమాల్లో..

తెలుగులో 100కు పైగా సినిమాల్లో నటించడమంటే మాటలా. ఇతరభాషలన్నీ కలిపితే ఆమె

కనీసం 400 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కమెడియన్ గా ఆమె టైమింగ్ సూపర్. వ్యాంప్ రోల్స్ కూడా ఆమె యాక్ట్ చేసి శెభాష్ అనిపించుకున్నారు. అయితే హీరోయిన్ అయినప్పటికీ ఇలాంటి వ్యాంప్ క్యారెక్టర్స్ వేయక తప్పలేదని ఫైనాన్షియల్ కారణాలతో తాను వ్యాంప్ గర్ల్ గా కూడా తెరపై నటించక తప్పలేదని ఆమె ఓపన్ గా చెప్పేవారు.

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే

తన తండ్రి కాకినాడలో వడ్డీ వ్యాపారం చేస్తూ నష్టపోగా చెన్నైకి షిఫ్ట్ అయినట్టు ఆమె చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వాళ్ల నాన్న సెలెక్ట్ చేసిన ఏ రోల్స్ అయినా ఆమె నో చెప్పకుండా ఓకే చేశారట. పద్మనాభంతో కలిసి నటించటం అస్సలు ఇష్టంలేకపోయినా వంద సినిమాల్లో పద్మనాభంతో కలిసి యాక్ట్ చేశానని ఆమె ఇంటర్వ్యూల్లో వివరించేవారు. వీరిద్దరిపై సరదాగా ఏదో ఒక కామెడీ పాట కూడా ఉండేది. ఇక ఈమెకు తల్లిగా చాలా సినిమాల్లో సూర్యకాంతం యాక్ట్ చేశారు. సో ఆకాలంలో కామెడీ ట్రాక్ అంటే వీరు ముగ్గురి మధ్య ఉండేది.

ఎన్టీఆర్ కు క్యారియర్

గీతాంజలి అమ్మ చేసే వంటలంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టమట. అందుకే రెగ్యులర్ గా ఎన్టీఆర్ కు ఇష్టమైన పులిహోర, పొంగలి, చికెన్ గీతాంజలి అమ్మ వండి బాక్స్ పంపేవారట. ఈ విషయాన్ని స్వయంగా గీతాంజలి చాలామార్లు గుర్తుచేసుకుని ఆనందించేవారు. అయితే ఆమెను సీతగా సెలెక్ట్ చేసి ఛాన్స్ ఇచ్చింది కూడా ఎన్టీఆరే కావటంతోఆమెకు ఎన్టీఆర్ అంటే ఎక్కడలేని అభిమానం, గౌరవం. ఎన్టీఆర్ తనకు మొదటి గురువు అని తనకు తమిళంలో ట్యూషన్స్ పెట్టించింది కూడా అన్నగారే అని ఆమె తరచూ గుర్తుచేసుకునేవారు. అందుకే ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఈమెకు మంచి బాండేజ్ ఉండేది. సీతారామ కల్యాణం సినిమాలో సీత రోల్ కోసం.. ఎంతోమందిని చూసిచూసి విసుగెత్తిపోయిన ఎన్టీఆర్ గీతాంజలిని చూసి ఆమె సరిగ్గా సెట్ అవుతారని అంచనా వేశారట. అంతేకాదు ఎన్టీఆర్ మెచ్చిన సీతగా ఆమె ఇండస్ట్రీలో పేరుసంపాదించుకున్నారు.

స్టార్ హీరోలు, కామెడీ స్టార్స్ తో..

ఓవైపు పద్మనాభంతో కలిసి కామెడీ చేసి హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకున్నారు. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావుకి చెల్లిగా చాలా సినిమాల్లో నటించి మెప్పించటం గీతాంజలి స్పెషాలిటీ. కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో ఆడి పాడిన గీతాంజలి పెళ్లయ్యాక సినిమాలు మానేశారు.

టాలీవుడ్ లో జరిగే ఫంక్షన్స్ అన్నింటికీ అటెండ్ అయ్యేవారు ఆమె. నాటి సంగతులు అన్నీ వివరించే యాక్టర్ గా ఆమె మీడియాకు చాలా ఫ్రెండ్లీ ఫిగర్ గా ఉండేవారు. తన కుమారుడిని హీరో చేయాలని చెన్నై నుంచి వచ్చి ఆమె హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. కుమారుడిని హీరోగా లాంచ్ చేసిన సినిమా భూమా ఫ్లాప్ కావటంతో ఆదిత్ శ్రీనివాస్ కెరీర్ హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు.

రాజకీయాల్లోనూ

నంది అవార్డ్ కమిటీ మెంబర్ గా, తెలుగుదేశం పార్టీ లీడర్ కూడా ఆమె పనిచేశారు. కానీ పార్టీలో సరైన గుర్తింపు పొజిషన్ దక్కలేదని ఓపన్ గా ఇంటర్వ్యూల్లో చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు గీతాంజలి. ఆమె చాలా ఫ్రాంక్ గా మాట్లాడి అందరితో కలిసిపోయేవారు. ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వం చాలా తక్కువమందికి ఉంటుందని తోటి హీరోయిన్స్ కూడా గీతాంజలిని ప్రశంసించేవారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News