Sitaare Zameen Par – Aamir Khan: ఒకే ఒక్క సినిమాతో సౌత్‌లో మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయింది జెనీలియా. హా..హాసిని గా తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికీ సుపరిచితురాలు. బొమ్మరిల్లు సినిమాతో సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న జెనీలియా ఆ తర్వాత ఢీ, రెడీ, నా అల్లుడు, హ్యాపీ, ఆరెంజ్ లాంటి సినిమాలు చేశారు. వీటిలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించినవే. ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన హిందీ సినిమా సితారే జమీన్ పర్. ఈ సినిమా ప్రమోషన్స్‌తో జెనీలియా బిజీగా ఉన్నారు.
వరుసగా ముంబైలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలో జెనీలియాకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. రెడీ హిందీ రీమేక్‌లో మిమ్మల్ని తీసుకోనందుకు బాధపడ్డారా? అని అడగగా.. దానికి జెనీలియా అలా అని కాదు గానీ, నన్ను సంప్రదించుంటే సంతోషంగా ఆ సినిమాను ఒప్పుకునేదాన్ని. ఎందుకంటే తెలుగులో అది నా సినిమా. అయినా ఆ అవకాశం పోయిందంటే సల్మాన్‌తో మరో సినిమా నాకోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు కదా.. అని చెప్పారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/radhika-apte-bold-movie-sisiter-midnight-on-ott/
ఇక సౌత్‌లో మీకు మంచి పాత్రలు దక్కలేదు కదా? అని యాంకర్ ప్రశ్నించగా వెంటనే జెనీలియా మధ్యలోనే అడ్డుకుంటూ.. సౌత్‌లో నాకెప్పుడూ మంచి పాత్రలే దక్కాయి. నా సినిమాలు గనక మీరు చూస్తే సౌత్‌లో నాకు ఎన్ని అద్భుతమైన పాత్రలు వచ్చాయో తెలుస్తుంది. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. నాకు దర్శక నిర్మాతలు మంచి సినిమాలు ఇచ్చారు. ఈ విషయంలో నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఈరోజు హైదరాబాద్‌కు వెళ్లినా సరే హాసిని (బొమ్మరిల్లులో జెనీలియా పాత్ర పేరు) అంటే చాలు నా పేరు చెప్తారు..అంటూ యాంకర్ కి కౌంటర్ ఇచ్చింది.
ఒక్క తెలుగులోనే కాదు, తమిళంలో హరిణి (సంతోష్ సుబ్రహ్మణ్యం), మలయాళంలో ఆయేషా (ఉరుమి) అనే పేర్లతోనే నన్ను ఇప్పటికీ పిలుస్తుంటారు. సౌత్ సినిమాలలో ఇలాంటి పాత్రలు కొందరికే వస్తాయి. ఆ కొందరిలో నాకు దక్కడం అదృష్టం. శంకర్, రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్లతో మాత్రమే కాకుండా కొత్త దర్శకులతోనూ సినిమాలు చేశాను. ఈ సినిమాలు చేసినన్ని రోజులు నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను.. అని చెప్పుకొచ్చారు. జెనీలియా మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.