Wednesday, June 4, 2025
Homeచిత్ర ప్రభGhaati: అనుష్క 'ఘాటీ' చిత్రం రిలీజ్ డేట్ వచ్చేసింది

Ghaati: అనుష్క ‘ఘాటీ’ చిత్రం రిలీజ్ డేట్ వచ్చేసింది

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఘాటీ'(Ghaati). ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అనుష్క గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జులై 11న మూవీని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం స్వీటీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు.

- Advertisement -

ఈ చిత్రంలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు, చైతన్య రావు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో తెలుగు సినిమాలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో ఆయన దేశీ రాజు అనే పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News