Ghaati: వేదం (Vedam) తర్వాత అనుష్క (Anushka Shetty), డైరెక్టర్ క్రిష్ (Director Krish) కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ఘాటి (Ghaati). దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో అనుష్క చేసిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరిహరవీరమల్లు నుంచి మధ్యలోనే తప్పుకున్న క్రిష్.. ఈ సినిమాను రూపొందించారు. క్రైమ్ డ్రామా థ్రిల్లర్‌గా (Crime Thriller) తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్స్, టీజర్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాకు అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ వంటి స్టార్లు కూడా సపోర్ట్ చేయడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. విక్రమ్ ప్రభు (Vikram Prabhu) హీరోగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు (Jagapathi Babu), చైతన్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ వారం రిలీజైన సినిమాల్లో ఘాటిపైనే ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి. ఘాటి ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
అనుష్క విశ్వరూపం…
ఘాటి మూవీకి ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. క్రిష్ స్టోరీ అంచనాలకు తగ్గట్లు లేకపోయినా షీలావతి పాత్రలో అనుష్క విశ్వరూపం చూపించిందని నెటిజన్లు చెబుతున్నారు. యాక్షన్ సీన్లలో అదరగొట్టిందని, లేడీ రెబల్ స్టార్ అని నిరూపించుకుందనే టాక్ వినిపిస్తోంది. ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయాయని కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ సలార్‌లోని (Prabhas Salaar) కాటేరమ్మ కొడుకు యాక్షన్ సీన్ అప్పట్లో ఫేమస్ అయ్యింది. అలాంటి మాసీ ఫైట్ సీన్ ఈ సినిమాలో ఒకటి ఉందని, ఘాటీకి అదే హైలైట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ప్రెడిక్టబుల్…
రివేంజ్ డ్రామా కథను థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ఆవిష్కరించడంలో మాత్రం క్రిష్ తడబడిపోయాడని అంటున్నారు. కథ చాలా వరకు ప్రెడిక్టబుల్‌గా సాగడం ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందని చెబుతున్నారు. ల్యాగ్ సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండాఫ్ బోర్ ఫీలింగ్‌ను కలిగిస్తుందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కథకు కీలకమైన గంజాయి ఎపిసోడ్స్‌ను అంత ఎఫెక్టివ్‌గా క్రిష్ చెప్పలేకపోయారని అంటున్నారు. మాస్ డైలాగ్స్‌కు అనుష్క వాయిస్ సెట్టవ్వలేదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
Also Read- Ganesh Nimajjanam: గణపయ్య నిమజ్జనం సమయంలో ఈ తప్పులు చేస్తే.. మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
మ్యూజిక్ చాలా బాగుందని, విజువల్‌గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటూ ప్రీమియర్స్ చూసిన ఆడియెన్స్ చెబుతోన్నారు. కథ పరంగా కొన్ని లోపాలు ఉన్నా.. నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఓ వెరైటీ సినిమా చేసిన క్రిష్, అనుష్క ధైర్యానికి మెచ్చుకొని తీరాల్సిందేనని అంటున్నారు.


