Ott Release: ఈ వారం థియేటర్లలో పవన్ కళ్యాణ్ ఓజీ మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓజీకి పోటీగా ఏ సినిమా థియేటర్లలోకి రాలేదు. కానీఈ వారం ఓటీటీ ఫ్యాన్స్‌కు మాత్రం పండగలా నిలిచింది. స్టార్ హీరోహీరోయిన్లు నటించిన ఇరవై వరకు సినిమాలు ఈ ఒక్క రోజే ఓటీటీలోకి వచ్చాయి. అందులోనూ అగ్రనాయికలు నటించిన సినిమాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఆ సినిమాలు ఏవంటే?
అనుష్క ఘాటీ…
అనుష్క హీరోయిన్‌గా నటించిన ఘాటీ మూవీ నేడు (సెప్టెంబర్ 26న ) అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహించాడు. విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఘాటీ ఓటీటీలోకి వచ్చింది.
త్రిప్తి డిమ్రి ధడక్ 2..
యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి కథానాయికగా నటించిన ధడక్ 2 మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో విజయవంతమైన పెరియారుమ్ పెరుమాల్‌కు రీమేక్‌గా ధడక్ 2 రూపొందింది. ఈ సినిమాలో సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటించాడు. థియేటర్లలో ధడక్ 2 ముప్పై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది.
మృణాల్ ఠాకూర్ సన్నాఫ్ సర్ధార్ 2
బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ సన్నాఫ్ సర్ధార్ 2 సడెన్‌గా శుక్రవారం ఓటీటీలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హిందీ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. విజయ్ కుమార్ అరోరా డైరెక్టర్. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది.
కళ్యాణి ప్రియదర్శన్ మలయాళం మూవీ…
కళ్యాణి ప్రియదర్శన్ మలయాళ మూవీ ఓడుం కుతిర చాదుం కుతిర నెట్‌ప్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ కామెడీ డ్రామా మూవీలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించాడు. మలయాళ కమెడియన్ అల్తాప్ సలీమ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.
మాళవికా మోహనన్ హృదయపూర్వం…
రాజాసాబ్ బ్యూటీ మాళవికా మోహనన్ లేటెస్ట్ మలయాళం మూవీ హృదయపూర్వం థియేటర్లలో వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ జియో హాట్ స్టార్‌లో విడుదలైంది. హృదయపూర్వం మూవీలో మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించాడు.
Also Read – OG Movie First Day Collections : దుమ్మరేపిన ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రికార్డులన్నీ బ్రేక్?


