Rashmika VS Anushka: ఇదివరకటితో పోలిస్తే టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్ బాగా తగ్గింది. మహిళా ప్రధాన చిత్రాల సక్సెస్ రేటు తక్కువగా ఉండటంతో ఈ జానర్‌లో కథలు సిద్ధం చేసేందుకు దర్శకులు అంతగా ఆసక్తిని చూపడం లేదు. ఫిమేల్ సెంట్రిక్ కథలకు న్యాయం చేయగల నాయికలు తగ్గిపోయారు. హీరోలదే డామినేషన్ కనిపించే ఇండస్ట్రీలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడంఅంత ఈజీ కాదు. కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌లో హీరోయిన్లపై అదనపు బాధ్యతలు చాలానే ఉంటాయి. బిజినెస్, ప్రమోషన్స్ అన్ని హీరోయిన్ల ఇమేజ్‌పైనే ఆధారపడి ఉంటాయి. రిజల్ట్ అటుఇటుగా వచ్చినా నష్టం నాయికలకే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అనగానే నేటితరం హీరోయిన్లు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అనుష్క, రష్మిక మందన్నతో పాటు మరికొందరు నాయికలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాలు ఏవంటేఝ
పరదా…
పరదా మూవీతో ఫస్ట్ టైమ్ ఫిమేల్ సెంట్రిక్ జానర్‌ను టచ్ చేసింది అనుపమ పరమేశ్వరన్. సొసైటీలోని అసమానతలపై ఓ ఇద్దరు మహిళలతో కలిసి ఓ యువతి ఎలాంటి పోరాటం చేసిందనే పాయింట్‌తో పరదా మూవీ తెరకెక్కుతోంది. ఆగస్ట్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం అనుపమ పరమేశ్వరన్ చాలా కష్టపడుతోంది. ప్రమోషన్స్ భారాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకుంది. ఇటీవల ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యింది. పరదా మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు.
Also Read – Sudarshan Chakra : భారత గగనతలంలో ‘సుదర్శన చక్రం’.. 2035 నాటికి శత్రువులకు చుక్కలే!
ఘాటి…
నవతరం నాయికల్లో ఫిమేల్ ఓరియెంటెడ్ కథలకు న్యాయం చేయగలిగే ఒకే ఒక హీరోయిన్‌గా అనుష్క నిలిచింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి మహిళా ప్రధాన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. కొంత గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ఘాటి. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఘాటిలో యాక్షన్ రోల్‌లో అనుష్క కనిపిస్తోంది. ఘాటి మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో తమిళ హీరో విక్రమ్ ప్రభు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
రష్మిక.. ది గర్ల్‌ఫ్రెండ్… మైసా…
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతుంది రష్మిక మందన్న. కూర్గ్ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఈ విజయాలతో హిందీ, తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెడుతుంది రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగులో ఫిమేల్ సెంట్రిక్ స్క్రిప్ట్‌లతో ది గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు మైసా సినిమాలు చేస్తుంది. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మూవీ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. మైసాలో వారియర్ ప్రిన్సెస్ తరహా రోల్‌లో రష్మిక కనిపించబోతున్నది. రవీంద్ర పుల్లే డైరెక్టర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలో మొదలైంది.
Also Read – Janmastami 2025: కృష్ణాష్టమి నాడు అర్థరాత్రి దోసకాయ ఎందుకు కోస్తారో మీకు తెలుసా!
ఇవే కాకుండా కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, కన్నేవీడి, సంయుక్త మీనన్ డైరెక్టర్ యోగేష్ కాంబోలో వస్తున్న సినిమా, హన్సిక గాంధారితో పాటు మరికొన్ని సినిమాలు లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌లతో రూపొందుతున్నాయి.


