Rao Bahadur First Look : టాలీవుడ్‌లో కొత్త, వినూత్న కథలకు పెద్ద పీట వేస్తున్న తరుణం. స్టార్స్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే దర్శకులు వైవిధ్యమైన సినిమా కథలను సిద్ధం చేస్తున్నారు. అందుకు తగినట్లే మేకర్స్ కూడా సినిమాలు చేయటానికి ముందుకు వస్తున్నారు. స్టార్స్ సైతం డిఫరెంట్ రోల్స్ చేయటానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. టాలీవుడ్‌లో నేటి తరం నటుల్లో సత్యదేవ్ (Satyadev) తనదైన గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రతిభతోపాటు ఏ పాత్రనైనా తనదైన శైలిలో మెప్పించగల సత్తా సత్యదేవ్ సొంతం. గతంలో ‘గాడ్‌ఫాదర్’, ‘కింగ్డమ్’ వంటి చిత్రాలలో తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ, హీరోగా అతని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ తరుణంలో మహేష్ బాబు వంటి అగ్ర హీరో సపోర్ట్ సత్యదేవ్‌కు దొరకటం ఎంతో ప్లస్ అయ్యింది.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగానే కాకుండా జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌తో నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. ఇది వరకు ఆయన అడివిశేష్ హీరోగా చేసిన మేజర్ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. ఆ సినిమాతో మంచి లాభాలను సంపాదించిన మహేష్ వెంటనే ఎందుకనో ప్రొడక్షన్ సైడ్ దృష్టి పెట్టలేదు. చాలా గ్యాప్ తర్వాత మరోసారి మహేష్ తన బ్యానర్‌లో ‘రావు బహదూర్’ (Rao Bahadur) సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి మహేష్, నమ్రత సమర్పణ. ఇందులో టైటిల్ పాత్రను సత్యదేవ్ పోషిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. సత్యదేవ్ లుక్ చూసిన వారందరూ స్టన్ అవుతున్నారు. దీంతో అయినా హీరోగా సత్యదేవ్‌కు బ్రేక్ వస్తుందని భావిస్తున్నారు. అందుకు కారణం.. మహేష్ బాబు హస్తవాసి మంచిది అని సినీ వర్గాల్లో ఒక నమ్మకం ఉంది, ‘మేజర్’ సినిమాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడం దీనికి నిదర్శనమంటున్నారు.
‘C/o కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహ (Nenkatesh Maha) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘రావు బహదూర్’ ఒక సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతోంది, కథ ఒక రాజవంశం నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో సత్యదేవ్ రాజవంశీకుడి గెటప్‌లో కనిపించారు, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్ట్ 15న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.
Coming to you as A never before
Mental Mass 𝗥𝗔𝗢 𝗕𝗔𝗛𝗔𝗗𝗨𝗥Crafted by the genius @mahaisnotanoun @GMBents @SrichakraasEnts @AplusSMovies @Mahayana_MP #summer2026 @RaoBahadurMovie #RaoBahadur pic.twitter.com/Vgx58h50g4
— Satya Dev (@ActorSatyaDev) August 12, 2025
ప్రస్తుతం సత్యదేవ్‌కు ఒక పెద్ద విజయం అత్యవసరం. మరి ‘రావు బహదూర్’ ఆ విజయాన్ని అందించి, అతని కెరీర్‌ను మలుపు తిప్పుతుందో లేదో వేచి చూడాలి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/coolie-vs-war-2-usa-box-office-pre-sales-battle/


